అన్నమయ్య జిల్లా నందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. 22వ తేదీ వరకూ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలకు ఇవాళ అంకురార్పణ నిర్వహించనున్నారు. ఆదివారం ఉదయం 7.45 నుంచి 8.15 గంటల వరకూ కర్కాటక లగ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఉదయం 8 గంటలకు, రాత్రి 7 గంటలకు వాహనసేవలు జరుగుతాయి. రేపు ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.
జూలై 20వ తేదీ ఉదయం 10 గంటలకు ఆర్జిత కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. దంపతులు ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. రూ.500/- చెల్లించిన వారికి ఈ కల్యాణోత్సవంలో పాల్గొనేందుకు అవకాశం కల్పించారు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదాలు బహుమానంగా అందజేస్తారు. జూలై 23న సాయంత్రం 6 గంటలకు పుష్పయాగం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్ట్, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.