మణిద్వీపం.. వైకుంఠం, కైలాసం కంటే కూడా అత్యద్భుతమట..

శ్రీ చక్ర బిందు రూపిణి శ్రీ లలితా మహా త్రిపుర సుందరి అమ్మవారు నివాసముండే పవిత్ర ప్రదేశమే మణి ద్వీపం అనేసి చెప్పుకున్నాం. మరి అలాంటి మణిద్వీప వర్ణన మహత్యం ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మణి ద్వీపాన్ని వర్ణించాలంటే మన శక్తి ఏమాత్రం చాలదట. మణిద్వీపంలోని చింతామణి గృహంలో అమ్మవారు పరివేష్టమై ఉంటారు. ఈ మణిద్వీపంలో వజ్రాలు, రత్నాలు, ముత్యాలు లాంటి నవ నిధులతో పాటు బంగారు మయమైన కొండలు ఉంటాయట. అమ్మవారిని దర్శించుకోవాలంటే మనం అనేక ప్రాకారాలను దాటి వెళ్లాల్సి ఉంటుందట.

ఈ ప్రాకారాల్లో మొదట వచ్చేది ఇనుప ప్రాకారం. దీనిలో భూమండలంలోని రారాజులు ఉంటారు. వీరు అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులను లోపలకు పంపుతుంటారని చెబుతారు. అనంతరం కంచుతో చేసిన రెండో ప్రాకారం.. ఇది పచ్చటి అరణ్యములతో, వివిధ రకాల జంతువులు, పక్షుల కిలకిలరావాలతో ప్రతిధ్వనిస్తూ ఉంటుందట. ఇలా అనేక ప్రాకారాలు దాటిన అనంతరం చింతామణి గృహంలో జ్ఞాన మండపంలో అమ్మవారు పరివేష్టితమై ఉంటారు. ముక్తి మండపంలో మంత్రులతో చర్చలు నిర్వహిస్తారట. అంతేకాకుండా వైకుంఠం, కైలాసం కంటే కూడా అమ్మవారి నివాసం అత్యద్భుతంగా ఉంటుందట. యావత్ విశ్వంలో ఎక్కడా లభించనంత సంపద అక్కడ ఉంటుందట.

Share this post with your friends