మహాదేవుడు పార్వతీదేవికి పద్మరాజు కథ వివరించాడట.. ఆ కథేంటంటే..

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఉన్న శ్రీ రూపేశ్వర మహాదేవుడి ఆలయం గురించి తెలిసిందే. ఈ ఆలయంలో రెండు శివలింగాలున్నాయి. ఐదున్నర అడుగుల ఎత్తైన మహిషాసుర మర్దినీ విగ్రహం కూడా ఈ ఆలయంలోనే ఉంది. అమ్మవారు మహిషాసుర మర్ధిని కాబట్టి ఆయుధాలను ధరించి ఒకింత భయంకరంగా కనిపిస్తుంది. పురాణాల ప్రకారం మహాదేవుడు పద్మ కల్పంలో పార్వతీ దేవికి పద్మరాజు కథను వివరించాడని చెప్పడం జరిగింది. ఆ కథేంటంటే.. పద్మరాజు అడవిలోని జంతువులన్నింటినీ చంపేశాడట. అనంతరం అడవిలో వెళుతుండగా ఆయనకు తపస్సు చేసుకుంటున్న యువతి కనిపించింది. అప్పుడు పద్మరాజు.. యువతిని వివరాలు అడిగాడు.

తను కణ్వ మహర్షిని తండ్రిగా భావిస్తున్నట్టు చెప్పిందట. ఆమె అందానికి దాసుడైన రాజు.. వివాహం చేసుకోవాలని భావించాడట. అనుకున్నదే తడవుగా పెళ్లి ప్రతిపాదన తీసుకొచ్చాడట. ఆ అమ్మాయి కూడా పెళ్లికి అంగీకరించిందట. అయితే తన తండ్రి వచ్చేవరకూ ఆగాలని చెప్పిందట. కానీ రాజు వినకుండా ఆమెను గాంధర్వ వివాహం చేసుకున్నాడు. కణ్వ మహర్షి తిరిగి వచ్చి ఆ యువతితో పాటు రాజును వైకల్యంతో జీవించమని శపించాడు. రాజును ఇష్టపడ్డానని.. కాబట్టే భర్తగా ఎన్నుకున్నానని చెప్పి శాప విముక్తి కోరింది. అప్పుడు కణ్వ మహర్షి వారిద్దరినీ శివయ్య వద్దకు పంపాడు. అక్కడ శివయ్యను దర్శనం చేసుకున్న వెంటనే ఇద్దరూ తిరిగి అందంగా మారిపోయారట. అప్పటి నుంచి ఆ శివలింగాన్ని రూపేశ్వర మహదేవుడిగా కొలవడం జరుగుతోంది.

Share this post with your friends