సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన సమయంలో మహా కుంభమేళా మొదలవుతుంది. భూమిపై ఏడాది.. దేవతలకు ఒక రోజుతో సమానం. దేవతలు, రాక్షసుల మధ్య 12 సంవత్సరాల పాటు యుద్ధం జరిగింది. పన్నెండేళ్లకోసారి పూర్ణకుంభమేళా నిర్వహిస్తారు. దేవతలకు 12 సంవత్సరాలైతే.. భూమిపై 144 సంవత్సరాలకు సమానం అవుతుంది. అందుకే 144 సంవత్సరాలకోసారి మహా కుంభమేళా జరుగుతుంది. కుంభమేళా సమయంలో ఈ నదుల్లో పుణ్యస్నానాలు ఆచరిస్తే మోక్షం లభిస్తుందని హిందువుల విశ్వాసం. పురాణాల ప్రకారం.. అమృతం కోసం దేవతలు ఓ వైపు, రాక్షసులు ఓ వైపు కలిసి క్షీరసాగర మథనం చేస్తారు. ఆ సమయంలో బయటికి వచ్చిన అమృతం కోసం.. దేవతలు, రాక్షసుల మధ్య 12 రోజుల పాటు యుద్ధం జరిగింది. ఆ అమృత భాండం నుంచి కొన్ని చుక్కలు భూమిపై పడ్డాయని.. ఆ అమృతం ప్రయాగ్జ్, ఉజ్జయినీ, హరిద్వార్, నాసిక్ లోనే పడ్డాయని.. అందుకే అక్కడ కుంభమేళా జరుగుతుందని చెబుతారు.
ఈ సారి మహా కుంభమేళాకు ఎంతో విశిష్టత ఉంది. 144 సంవత్సరాల తర్వాత మహా కుంభమేళా జరుగుతుంది. సాధారణంగా ప్రతి ఆరు సంవత్సరాలకోసారి అర్ధ కుంభమేళా జరుగుతుంది. 12 సంవత్సరాలకోసారి కుంభమేళా నిర్వహిస్తారు. 144 సంవత్సరాలకోసారి మహా కుంభమేళా జరుగుతుంది. ఏటా కుంభమేళా నాలుగు ప్రాంతాల్లో జరుగుతుంది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్, ఉత్తరాఖండ్లోని హరిద్వార్, మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని, మహారాష్ట్రలోని నాసిక్ కుంభమేళాలో జరుగుతుంది. అయితే, 144 సంవత్సరాలకోసారి జరిగే మహా కుంభమేళా మాత్రం కేవలం ప్రయాగరాజీలోనే నిర్వహిస్తారు.
Maha Kumbh Mela 2025: Yatra – Travel, Accommodation, Holy Bath Ghats Detailed Vlog | Prayagraj
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం… మహా కుంభమేళా. గంగా, యయున, సరస్వతీ నదులు ప్రయాగ్ లో ఒకటిగా కలిసే త్రివేణి సంగమం. దాదాపు 45 రోజుల పాటు కొనసాగే ఆధ్యాత్మిక సంరంభం. 144 ఏళ్లకు ఒకసారి వచ్చే పరమ పవిత్ర వేడుక. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో మహా కుంభమేళ అంటే ఏమిటి? అసలు ఈ కుంభమేళకి మన తెలుగు రాష్ట్రాల నుండి ఎలా వెళ్ళాలి? ఇక్కడ మీరు దర్శించుకోవాల్సిన ముఖ్యమైన ప్రదేశాలు, ఎంతో విశిష్టత చరిత్ర కలిగిన ఆలయాల దర్శనం గురించి, ఇక్కడ భారత ప్రభుత్వం, అలాగే యూపీ ప్రభుత్వం చేపట్టిన ఏర్పాట్లు ఎలా వున్నాయి? కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో అందిస్తాను. ఇక్కడ ఎలా వెళ్ళాలి? ఇక్కడ అకామడిషన్ గురించి మీరు ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. క్లియర్ గా అర్ధం అవుతుంది. ఈ క్రింద ఉన్న లింక్ ను క్లిక్ చేయండి.
Maha Kumbh Mela 2025: కుంభమేళా గురించి మీరు తెలుసుకోవలసిన అన్ని విషయాలు.. Detailed Vlog..!