ఆళ్వార్ సన్యాసికి శ్రీ మహావిష్ణువు వైకుంఠానికి ఎలా వెళ్లాలో చెప్పాడట..

ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్‌లోని చుంగి చౌరాహా సమీపంలో ఉన్న శ్రీ రంగనాథ ఆలయం విశేషమేంటో తెలుసుకున్నాం కదా. ఈ ఆలయంలో వైకుంఠానికి ద్వారం ఉందని చెబుతారు. ఏడాదికోసారి మాత్రమే తెరిచే ఈ ఆలయ విశేషాల గురించి తెలుసుకుందాం. ఈ ఆలయాన్ని దక్షిణ శైలిలో నిర్మించారు. ఈ ఆలయాన్ని రంగనాథుడి ఆలయం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ సాక్షాత్తు రంగనాథుడే నివసిస్తున్నాడని నమ్మకం. ఈ ఆలయం ఏడాదిలో ఒక్కసారి మాత్రమే తెరుచుకుంటుందని చెప్పుకున్నాం కదా. ఇంతకీ అదెప్పుడో తెలుసుకుందాం.

దక్షిణ భారత సంప్రదాయం ప్రకారం 21 రోజుల పాటు వైకుంఠ ఉత్సవం జరుపుకోవడం ఆనవాయితీ. ఆ సమయంలో 11 రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయని చెబుతారు. వైకుంఠ ఏకాదశి రోజున మాత్రమే ఈ ఆలయాన్ని తెరిచి ఉంచుతారు. ఆ రోజున పెద్ద ఎత్తున భక్తులు ఈ ఆలయానికి వస్తారు. ఈ ఆలయంలో వైకుంఠ ద్వారం గురించిన కథేంటంటే.. ఆళ్వార్ సన్యాసి ఆత్మ వైకుంఠానికి వెళ్ళడానికి మార్గం కోసం శ్రీ మహావిష్ణువును అడిగాడట. దీనికి లక్ష్మీదేవితో కలిసి శ్రీ మహావిష్ణువు.. వైకుంఠానికి ఎలా చేరుకోవాలో ఆళ్వార్ సన్యాసికి చెప్పాడట. అప్పటి నుంచి ఈ ఆలయంలోని వైకుంఠ ద్వారం ఏడాదికోసారి అంటే వైకుంఠ ఏకాదశి నాడు మాత్రమే తెరుస్తారు. ఈ రోజున ఈ ద్వారం ద్వారా వెళితే ఆధ్యాత్మిక విముక్తి లభిస్తుందట.

Share this post with your friends