తమిళనాడులోని కుంభకోణంలో కల్యాణ సుందరేశ్వరుని ఆలయ విశిష్టత చెప్పుకున్నాం కదా. ఉదయం నుంచి రాత్రి లోపు ఇక్కడి శివలింగం ఐదు సార్లు రంగులు మార్చుకుంటూ ఉంటుంది. నలుపు, తెలుపు, ఎరుపు, లేత నీలం, ఆకుపచ్చ రంగుల్లో దర్శనమిస్తూ ఉంటుంది. మరి ఇలా ఐదు సార్లు రంగులు మార్చుకోవడానికి కారణమేంటి? అనేది ఎవరికీ తెలియదు. ఈ మిస్టరీని ఛేదించేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నించినా కూడా అంతు చిక్కలేదు. ఆయన స్వయంగా రంగులు మార్చుకుంటాడని భక్తులు నమ్ముతారు. ఇక ఆయన ఏరంగులో ఉన్నప్పుడు దర్శించుకోవాలో అది భక్తుల ఇష్టం.
ఈ కల్యాణ సుందరేశ్వరుని ఆలయ నిర్మాణం వెయ్యేళ్ల కిందట జరిగింది. ఈ పురాతన ఆలయాన్ని అనేక సార్లు అప్పట్లో మహ్మదీయులు ధ్వంసం చేశారు. తిరిగి దీనిని పునరుద్ధరించారు. ఈ ఆలయం దక్షిణాదినే ఉన్నప్పటికీ చాలా మందికి పెద్దగా తెలియదు. ఇక ఈ ఆలయాన్ని “బ్లాక్ పగోడా” అని కూడా పిలుస్తారు. ఇలా పిలవడానికి కారణమేంటంటే.. ఇక్కడ ఉన్న రెండు నల్లరాతి శివలింగాలు. వీటిలో ఒకటి ప్రధాన గర్భగుడిలోనూ.. రెండవది ఆలయ ప్రాంగణంలోని ప్రవేశ ద్వారం దగ్గర ప్రతిష్టంబడి ఉంది. ఈ ఆలయంలోని శివయ్య ఉదయం బైద్యనాధుడిగా.. తలపై బంగారు కిరీటం, మూడు కళ్తు, చేతిలో గొడ్డలి.. మరో చేతిలో బాణంతో కనిపిస్తాడు. ఇక మధ్యాహ్న సమయంలో నీలకంఠ పురుషునిగా పూజలందుకుంటాడు.