నేడు హంసవాహనంపై ఊరేగిన పరాశరేశ్వర స్వామివారు..

నారాయణవనం శ్రీ చంపకవల్లి సమేత శ్రీ పరాశరేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు జూలై 5 నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. నేడు స్వామివారిని హంస వాహనంపై ఊరేగించారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతి రోజూ ఉదయం తిరుచ్చి ఉత్సవంతో పాటు స్వామి, అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తున్నారు. ఇక ఈ ఉత్సవాలు ఈ నెల 14వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. ఈ నెల 11 వ తేదీన స్వామివారి రథోత్సవం పెద్ద ఎత్తున జరగనుంది.

జూలై 12న స్వామివారి స్వామి, అమ్మవార్ల ఆర్జిత కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ కల్యాణోత్సవంలో దంపతులెవరైనా పాల్గొనవచ్చు. శ్రీ చంపకవల్లి సమేత శ్రీ పరాశరేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇక ఈ నెల 14వ తేదీన త్రిశూల స్నానంతో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

Share this post with your friends