31 నుంచి లక్ష్మీపురం శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు..

ఈ నెల 31 నుంచి కృష్ణా జిల్లా కృతివెన్ను మండలం లక్ష్మీపురం గ్రామంలో కొలువైన శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. జూన్ 4వ తేదీ వరకూ ఈ బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లూ చేస్తున్నారు. ఈ నెల 31న ఉదయం 8 గంటలకు స్థాపనం.. అనంతరం పసుపు కొట్టుట.. ఉదయం 9 గంటలకు స్వామి, అమ్మవార్లను పెళ్లి కొడుకు, పెళ్లి కుమార్తెను చేయుట వంటి కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఎనిమిదేళ్ల క్రితం నుంచి ఇక్కడ బ్రహ్మోత్సవ కార్యక్రమాలను ఏటా నిర్వహిస్తున్నారు.

అదే రోజు సాయంత్రం విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, ధ్వజారోహణ వంటి కార్యక్రమాలను నిర్వహించున్నారు. ఇక 1వ తేదీన చతుస్థానార్చనలు, మూలమంత్ర హోమం, స్వామివారికి అష్టోత్తర శత కలశాభిషేకం, ప్రత్యేక అలంకారం వంటి కార్యక్రమాలు జరుగనున్నాయి. ఇక 2 వ తేదీ సాయంత్రం స్వామివారి తిరు కల్యాణోత్సవం వైభవంగా జరగనుంది. 3వ తేదీన పుష్ప యాగం, శ్రీ లక్ష్మీ సుదర్శన యాగం నిర్వహించనున్నారు. సాయంత్రం వేళ మేళ తాళాలు, కోలాటంతో తిరువీధి ఉత్సవం వంటివి జరుగనున్నాయి. 4వ తేదీన ధ్వజారోహణ, నివేదన, పవళింపు సేవతో శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

Share this post with your friends