జమ్మలమడుగు శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సెప్టెంబరు 13 నుంచి పవిత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ పవిత్రోత్సవాలు రేపటి వరకూ అంటే 15వ తేదీ వరకు జరుగనున్న పవిత్రోత్సవాలకు గురువారం సాయంత్రమే పుణ్యహవచనం, మృత్సంగ్రహణం, అంకురార్పణం నిర్వహించారు. సెప్టెంబరు 13న చతుష్టార్చాన, అగ్ని ప్రతిష్ట, పవిత్ర ప్రతిష్ట, సాయంత్రం 6 గంటలకు యాగశాలలో వైదిక కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు.
సెప్టెంబరు 14న పవిత్ర సమర్పణ, సెప్టెంబరు 15న పూర్ణాహుతి, పవిత్ర వితరణ, స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తుల ఊరేగింపు జరుగనున్నాయి. యాత్రీకుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక దోషాలు జరుగుతుంటాయి. వాటి వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాది మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.