వైభవంగా జగన్నాథుని రథయాత్ర.. 53 ఏళ్ల తర్వాత తొలిసారిగా..

పూరిలోని జగన్నాథుని వార్షిక రథయాత్ర పెద్ద ఎత్తున ప్రారంభమైంది. జగన్నాథుడు తన అన్నా,చెల్లెలు బలభద్రుడు, సుభద్రతో కలిసి రథాలపై విహరిస్తున్నారు. ఆషాఢ మాసంలోని శుక్ల పక్ష ద్వితీయ తిథి నాడు ఈ రథయాత్ర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. దాని ప్రకారం ఇవాళ తెల్లవారుజామున 3.44 నుంచి ప్రారంభమైంది. 53 ఏళ్ల తర్వత రథయాత్ర రెండు రోజుల పాటు జరగనుండటం విశేషం. అంటే ఈ రథయాత్ర రేపు తెల్లవారుజామున 4:14 గంటల వరకూ జరగనుంది. 1971లో చివరి సారిగా రెండు రోజుల పాటు రథయాత్రను నిర్వహించారు. ఆ తరువాత తిరిగి ఇప్పుడు రెండు రోజుల పాటు జరుగుతోంది.

అసలు ఇలా రెండు రోజుల పాటు ఎందుకు రథయాత్ర నిర్వహిస్తున్నారంటారా? గ్రహాలు, రాశుల లెక్కల ప్రకారం నిర్వహిస్తున్నారు. ఈ సారి రథయాత్ర నాడు అరుదైన శుభకార్యక్రమాలు జరుతున్నాయి. రెండు రోజుల పాటు రథయాత్ర, ఇవాళ రవి పుష్య నక్షత్రం, సర్వార్థ సిద్ధి యోగం, శివాస్తో వంటి శుభ యోగాలు ఏర్పడ్డాయి. ఈ రవి పుష్య యోగంలో కొన్ని బంగారం, వెండి, వాహనం వంటి వస్తువులతో పాటు ఇల్లు కొన్నా కూడా చాలా మంచిదట. పైగా ఈ యోగంలో గృహ ప్రవేశం కూడా నిర్వహించుకోవచ్చు. కొత్త పనిని ప్రారంభించినా కూడా చాలా మంచిదట.

Share this post with your friends