శ్రీరంగంలోని రంగనాథుడిని దర్శించుకోవడానికి ముందు ఈ స్వామిని దర్శించుకోవాలట..

దక్షిణ భారతంలో రంగనాయక స్వామి క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. ఎన్ని ఉన్నా కూడా తమిళనాడులోని శ్రీరంగం క్షేత్రానికి మించినది లేదని చెబుతారు. దీనికి కారణం ఆ క్షేత్రం అంతలా ప్రసిద్ధి గాంచడమే. శ్రీరంగంలో రంగనాయకుడిని దర్శించుకోవడానికి ముందుగా మరో దేవుడిని దర్శించుకోవాలని చెబుతారు. ఆయనే ఆదిరంగనాథుడు. మరి ఈ ఆదిరంగడు కొలువైన క్షేత్రం ఎక్కడుంది? ఆక్షేత్ర విశేషాల గురించి తెలుసుకుందాం. ఆదిరంగడు కొలువైన మహిమాన్వితమైన క్షేత్రమే శ్రీరంగపట్నం రంగనాథ స్వామి దేవాలయం. శ్రీరంగపట్నంలోని శ్రీరంగనాధుడిని దర్శించుకోవాలంటే ముందుగా ఈ క్షేత్రాన్ని దర్శించుకోవాలి.

ఇక ఆ తరువాత కర్ణాటకలోని మధ్య రంగనాథ క్షేత్రాన్ని దర్శించుకోవాలి. ఆ తరువాత తమిళనాడులోని శ్రీ రంగనాథుడిని దర్శించుకోవాలి. శ్రీరంగపట్నం రంగనాథ స్వామి ఆలయం ఎక్కడుంది? కర్ణాటకలోని మాండ్య జిల్లాలో శ్రీరంగపట్నం ఉంది. ఇక్కడ రంగనాథస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని108 శ్రీ వైష్ణవ దివ్య క్షేత్రాల్లో ఒకటిగా పేర్కొంటారు. శ్రీరంగనాథ స్వామి క్షేత్రం హొయసల, విజయనగర రాజుల శిల్పకళా వైభవానికి ప్రతీక. అయిదు అంతస్థుల రాజగోపురంతో విలసిల్లే ఈ ఆలయం ఎవరు నిర్మించారనే విషయంలో స్పష్టత లేదు. కానీ చాలా శతాబ్దాల క్రితం నాటిదని చెబుతారు.

Share this post with your friends