శ్రీకృష్ణ దేవరాయలు కాలంలో కొండవీడుని జయించడానికి ముందు ఆయన కోటప్పకొండపై కొలువైన శివుడికి మొక్కాడట. దీంతో సునాయాసంగా శ్రీకృష్ణ దేవరాయులు కొండవీడుని జయించాడు. వెంటనే కోటప్పకొండకు వచ్చి స్వామివారికి విలువైన కానుకలు సమర్పించాడు. అంతటితో ఆగక స్వామివారి నిత్య ధూప దీప నైవేద్యాలకు ఎలాంటి లోటూ రాకుండా ‘కొండ కాపూరు’ అనే గ్రామాన్నే శిబుదు రాసిచ్చాడట. ఇక్కడ శివుడికి శాలంకయ్య ఆలయాన్ని నిర్మించాడు. అలాగే శిలగా మారిన గొల్లభామ ఆనందవల్లికి కూడా ఆలయం ఉంది.
అయితే స్వామివారి ఆలయాన్ని నిర్మించిన అనంతంర శాలంకయ్య అమ్మవారికి కూడా ఆలయం కట్టించాలని అనుకున్నాడట. కానీ ఆయన కలలోకి శివుడు వచ్చి సతీ దేవి వియోగంలో ఉన్న వాడినని.. కాబట్టి ఆమెకు గుడి కట్టించవద్దని చెప్పాడట. దీంతో శాలంకయ్య అమ్మ వారికి గుడి కట్టించే ఆలోచన మానుకున్నాడట. కోటప్పకొండలో మహాశివరాత్రి పెద్ద ఎత్తున జరుగుతుంది. ఈ శివరాత్రి సమయంలో చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో విద్యుత్ ప్రభలు వస్తాయి. నిత్యం పెద్ద ఎత్తున భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు.