
కాశీ ఘాట్‌లోని రెండు ముఖ్యమైన ఘాట్‌ల గురించి తెలుసుకున్నాం. సత్య హరిశ్చంద్ర, మణికర్ణిక ఘాట్‌ల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మిగిలిన ఘాట్‌ల గురించి తెలుసుకుందాం. వాటి ప్రత్యేకతేంటో కూడా చూద్దాం.
దశాశ్వంద్ ఘాట్: బ్రహ్మ దేవుడు ఇక్కడ పది అశ్వమేథ యాగాలు చేశాడట. కాబట్టి ఈ పది అశ్వాల పేరు మీదుగా ఈ ఘాట్‌కి దశాశ్వంద్ ఘాట్ అని పపేరు వచ్చింది. ఈ ఘాట్ గంగా హారతికి ప్రత్యేకం. ఏటా దేశ వ్యాప్తంగా లక్షల మంది భక్తులు ఈ హారతిని చూసేందుకు వస్తారు.
పంచ గంగ ఘాట్: ఐదు నదుల సంఘమం కాబట్టి ఈ ఘాట్‌ను పంచ గంగా ఘాట్ అని పిలుస్తారు. గంగా, యమునా, సరస్వతి, కిరణ, ధూతప్ప వంటి ఐదు నదుల సంగమం. ప్రపంచంలోనే అరుదైన సంగమంగా ఈ నదీ సంగమాన్ని చెబుతారు.
కేదార్ నాథ్ ఘాట్: ఈ ఘాట్‌ను శివస్వరూపంగా చెబుతారు. అంటే సాక్షాత్తు శివుడే ఇక్కడ కొలువై ఉంటాడట. ఇక్కడ విశేషమేంటంటే.. రాతి మెట్లు రకరకాల రంగుల్లో ప్రకాశిస్తుంటాయి. ఇది అత్యంత ప్రశాంతమైన ప్రదేశాల్లో ఒకటిగా చెబుతారు.
అస్సీ ఘాట్: ఇక్కడ రాక్షస సంహారం అనంతరం శివుడు తన కత్తిని పడేశాడట. దానిని అసి అంటారు. ఇక్కడ ఉదయం హారతి కార్యక్రమం జరుగుతుంది. అస్సి, గంగానదుల సంగమమే ఈ ఘాట్. దీనిని అగ్నిదేవుడి జన్మస్థలంగానూ పిలుస్తారు. కొన్ని శతాబ్దాల క్రితం ఇక్కడ ఓ ప్రమాదం జరిగిందట. దీని కారణంగా ఇక్కడున్న శివాలయం నదిలోకి ఒరిగిపోతూ ఉంటుంది.
