ఈ ఆలయానికి రాత్రి వేళ దేవతలంతా వస్తారట.. దానికి నిదర్శనమేంటంటే..

కొన్ని ఆలయ పరిసరాల్లో ఒక్కటంటే ఒక్క కాకి కూడా కనిపించదు. దీనికి ఏ ఆలయానికి తగిన కారణం దానికి ఉంది. కడప జిల్లాలోని పెండ్లిమర్రి మండలంలో వెయ్యి నూతల కోనలో కూడా కాకి అనేదే మనకు కనిపించదట. దీనికి శ్రీరామచంద్రుని శాపమే కారణమట. ఒంటి మిట్ట తరువాత శ్రీరామచంద్రుల వారు సీతమ్మతో కలిసి ఒంటిమిట్టకు వెళ్లి అక్కడి నుంచి వెయ్యి నూతల కోన ప్రదేశానికి వచ్చారని ప్రతీతి. ఈ ఆలయంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఉగ్రరూపంలో కొలువై ఉన్నాడు. ఈ ఆలయ విశేషం తెలిస్తే షాక్ అవుతారు.

ఇక్కడికి నిత్యం దేవతలంతా కలిసి రాత్రి సమయంలో వచ్చి నరసింహ స్వామివారిని పూజిస్తారట. దీనికి నిదర్శనం ఏంటంటే ఆలయ తలుపులు తెరవగానే మనకు రాలిన పువ్వులు దర్శనమిస్తాయట. అహోబిలం నుంచి లక్ష్మీనరసింహ స్వామి ఉగ్రంతో ఇక్కడికి వచ్చాడని చెబుతారు. అప్పుడు సాధువులందరూ భగవంతునికి అభిషేకం చేస్తే ఆయన మామూలుగా మారారు. కాబట్టి ఇక్కడ మనకు ఉగ్రరూపంలో ఉన్నస్వామివారితో పాటు శాంత మూర్తిగా ఉన్న స్వామివారు సైతం దర్శనమిస్తారు. ఈ ఆలయ ప్రాంతమంతా మనకు చాలా ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. వాల్మీకి మహర్షి ఇక్కడి గుహలో కూర్చుని రామాయణం రచించారని చెబుతారు.

Share this post with your friends