దేవాలయాల వద్ద గృహ నిర్మాణం చేయవచ్చా? చేయకూడదా? ఆలయ నీడ ఇంటిపై పడకూడదంటారు ఎందుకు? మన పెద్దలు గృహాన్ని మందిరంతో పోల్చారు కదా.. అలాంటప్పుడు దేవాలయం నీడ మన గృహంపై ఎందుకు పడకూడదు? అసలు ఏ ఏ ఆలయాలకు సమీపంలో గృహ నిర్మాణం చేయకూడదో చూద్దాం. దేవాలయాల నీడ మన ఇంటిపై పడితే వాస్తు ప్రకారమైతే ఐశ్వర్యం అటుగంటుందని చెబుతారు. అంతేకాకుండా లేనిపోని అనారోగ్యాలు, ఆయుక్షీణం వంటివి ఉంటాయని వాస్తు చెబుతోంది. దేవాలయానికి గృహ నిర్మాణం చేపట్టే యజమాని కుడి చేతిని ముందుకు చాచి ఎడమ మన పెద్దలు మూడు రకాలుగా విభజిస్తారు.
అవేంటంటే.. వైష్ణవ, శైవ, శక్తి దేవాలయాలు. ఇక దేవాలయాల్లో దేవతా విగ్రహాలను కూడా సౌమ్యం, భోగం, యోగం, ఉగ్రం అంటూ నాలుగు రకాలుగా విభజిస్తారు. అయితే ఏ ఆలయానికి ఎంత దూరంలో ఇల్లు నిర్మించుకోవాలో కూడా పెద్దలు చెప్పారు. శివాలయానికైతే నూరు బారుల దూరం లోపల ఇంటి నిర్మాణం చేయకూడదు. విష్ణు ఆలయానికి అయితే కనీసం ఇరవై బారుల లోపల, శక్తి ఆలయానికి సమీపంలోనూ ఇంటి నిర్మాణం తగదు. శివుడు మూడో కన్ను తెరిస్తే భస్మమే అంటారు కాబట్టి శివాలయానికి దగ్గరలో ఇంటి నిర్మాణం తగదు. అలాగే ఇక విష్ణువు సూర్య నారాయణుడి అవతారం కాబట్టి సూర్యుడి కిరణాలు సౌమ్య రూపంలో నిత్యం నారాయణుడి శిరస్సు వెనుక చక్రాకారంలో తిరుగుతూ ఉంటాయట. ఆ చక్రం వెనుక భాగాన రాక్షసులతో యుద్ధంలో పాల్గొంటుంది కాబట్టి వైష్ణవాలయానికి వెనుక భాగాన ఇల్లు కట్టకూడదట.