జ్యోతిర్లింగ క్షేత్రాలను ఏకకాలంలో చూసేందుకు ఐఆర్‌సీటీసీ అద్భుతమైన ఆఫర్..

జ్యోతిర్లింగ క్షేత్రాలు చూడాలని ఎవరు కోరుకోరు.. అయితే అదంతా ఖర్చుతో కూడుకున్న పని. పైగా ఒకేసారి ఏడు క్షేత్రాలను చూడటం అంటే అయ్యే పని కాదు. అలాంటి వారి కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ( IRCTC ) జ్యోతిర్లింగ ప్రత్యేక టూర్ ప్యాకేజీలను ప్రకటించింది. ఈ ఏడాది ఆగస్ట్, సెప్టెంబర్ మాసాల్లో జ్యోతిర్లింగ దర్శనానికి ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. ఆగస్ట్ యాత్రలో భాగంగా భక్తులకు ఏమేం జ్యోతిర్లింగాల దర్శనం కల్పిస్తారంటే.. ఉజ్జయిని (మహాకాళేశ్వరం, ఓంకారేశ్వర), ద్వారకా (నాగేశ్వర), సోమనాథ (సోమ్‌నాథ), పూణే (భీమశంకర), నాసిక్ (త్రయంబకేశ్వర), (ఔరంగాబాద్ (ఘృష్ణేశ్వర) క్షేత్రాలను సందర్శించవచ్చు. ఇక దీని కోసం రెండు ప్రత్యేక ప్యాకేజీలను ఐఆర్‌సీటీసీ అందుబాటులోకి తీసుకొచ్చింది.

భక్తులు సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్ క్లాస్‌లలో దేనినైనా బుక్ చేసుకోవచ్చు. ఇక ఈ యాత్ర కోసం భారత్ గౌరవ్ టూరిస్ట్ రైళ్లలో ప్రయాణిస్తారు. ఈ యాత్ర 12 రోజులు పాటు సాగనుంది. ఈ ఆధ్యాత్మిక యాత్రలో విజయవాడ, మధిర, ఖమ్మం, డోర్నకల్ జూనియర్, మహబూబాబాద్, వరంగల్, కాజీపేట, జనగాం, భోంగీర్, సికింద్రాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, ధర్మాబాద్, ముద్ఖేడ్, నాందేడ్, పూర్ణలలో బోర్డింగ్ / డి-బోర్డింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఇక ఎకానమీ (రూ.20590), స్టాండర్డ్ (రూ.33015), డబుల్/ట్రిపుల్ షేర్ ఆధారంగా కంఫర్ట్ (రూ.43355) అందుబాటులో ఉన్నాయి. 5-11 సంవత్సరాల పిల్లలకు ఛార్జీలు వరుసగా రూ.19255, రూ.31440 , రూ.41465 చెల్లించాల్సి ఉంటుంది.

Share this post with your friends