శ్రీవారి బ్రహ్మోత్సవాల వాహనసేవల బుక్‌లెట్‌ ఆవిష్కరణ

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ నెల 1 నుంచే శ్రీవారి పుష్కరిణిని అందుబాటులోకి తీసుకు రావడం జరిగింది. ఈ క్రమంలోనే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వాహనసేవల వివరాలతో కూడిన బుక్‌లెట్‌ను టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు ఆవిష్కరించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం అనంతరం ఈ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. శ్రీవారి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి.

ఇందులో బ్రహ్మోత్సవాల సమస్త సమాచారంతో ఆకట్టుకునే రంగులతో, చిత్రాలతో బుక్‌లెట్‌ను ముద్రించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓలు శ్రీమతి గౌతమి, శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్ఓ శ్రీ శ్రీధర్, సీఈ శ్రీ సత్యనారాయణ, సిపిఆర్ఓ డాక్టర్ టి.రవి, ప్రెస్ అండ్ పబ్లికేషన్స్ ప్రత్యేకాధికారి శ్రీ రామరాజు ఇతర అధికారులు పాల్గొన్నారు. శ్రీవారి అన్నప్రసాదంలో భాగంగా.. తిరుమలకు ప్రతిరోజు 23 రకాల కూరగాయలు వస్తున్నాయని ఈవో తెలిపారు. మెనూ ప్రకారము భోజనం అందిస్తున్నామన్నారు. తిరుపతిలోని విష్ణు నివాసంలో 50% ఆన్‌లైన్.. 50% ఆఫ్ లైన్ లో గదులు కేటాయిస్తారని ఈవో పేర్కొన్నారు.

Share this post with your friends