నందలూరు, తాళ్లపాక బ్రహ్మోత్సవాల కరపత్రాల ఆవిష్కరణ..

నందలూరు, తాళ్లపాక ఆలయాల బ్రహ్మోత్సవాల కరపత్రాలను టీటీడీ ఈవో శ్రీ జె. శ్యామలరావు, జేఈవో శ్రీ వీరబ్రహ్మంతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా నందలూరు సౌమ్యనాథ స్వామి, తాళ్లపాకలోని శ్రీ చెన్నకేశవ స్వామి, శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల కరపత్రాలను విడుదల చేశారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈఓ శ్రీమతి ప్రశాంతి, ఇతర అధికారులు పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా నందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు జూలై 14 నుంచి ఈ నెల 22వ తేదీ వరకూ వైభవంగా జరుగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలకు జూలై 13వ తేదీ అంకురార్పణ నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వాహన సేవలు జరగనున్నాయి.

తాళ్లపాకలోని శ్రీ సిద్ధేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు జూలై 17 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 25వ తేదీ వరకూ వైభవంగా జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాలకు జులై 16వ తేదీన అంకురార్పణ.. అనంతరం జూలై 17న ఉదయం 6.28 గంటలకు ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. అదే రోజున సాయంత్రం స్వామివారికి హంసవాహన సేవ నిర్వహిస్తారు. జులై 18, 19, 20, 21వ తేదీల్లో ఉదయం స్వామివారికి పల్లకీ ఉత్సవం నిర్వహిస్తారు. ఈ ఉత్సవానికి భక్తులు పెద్ద ఎత్తున హాజరు కానున్నారు. ఈ క్రమంలోనే పలు రకాల వాహన సేవలను సైతం నిర్వహించనున్నారు.

Share this post with your friends