
అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయ పోస్టర్లను జేఈవో శ్రీ వీరబ్రహ్మం శుక్రవారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ.. శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూన్ 16న అంకురార్పణ, జూన్ 17న ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. జూన్ 21న గరుడసేవ, జూన్ 22న హనుమంత వాహనం, జూన్ 24న రథోత్సవం, జూన్ 25న చక్రస్నానం, ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవోలు శ్రీ గోవిందరాజన్, శ్రీ గుణ భూషణ్ రెడ్డి, శ్రీ శివప్రసాద్, చీఫ్ పీఆర్వో డాక్టర్ టీ.రవి, అదనపు ఎఫ్ఏసీఏవో శ్రీ రవిప్రసాద్, ప్రధాన అర్చకులు శ్రీ సూర్యకుమారాచార్యులు పాల్గొన్నారు.
అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు రేపు అంకురార్పణ జరగనుంది. దీని కోసం జూన్ 11వ తేదీ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకూ.. రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. జూన్ 20వ తేదీ సాయంత్రం 4.30 గంటల నుంచి 6.30 గంటల వరకు స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. ఈ కల్యాణ మహోత్సవంలో పాల్గొనాలనుకునే దంపతులు రూ.500 చెల్లించి పాల్గొనవచ్చు. ఇక 17న ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.
