ఇంట్లో క్రిస్టల్ తాబేలును ఏ దిశలో పెట్టాలి?

తాబేలు బొమ్మను ఇంట్లో ఉంచుకుంటే చాలా మంచిదని.. ఆర్థిక సమస్యలు ఉండవని అంటారు. అలాగే తాబేలు బొమ్మ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెంపొందించడంతో పాటు వాస్తు దోషాలను సైతం తొలగిస్తుందట. ఈ క్రమంలోనే కొందరు క్రిస్టల్ తాబేలును ఇంట్లో తీసుకొచ్చి పెడతారు. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో రెండవది కూర్మావతారం. కూర్మం అంటే తాబేలు. క్షీర సాగర మథనం సమయంలో మందర పర్వతం మునిగిపోతోందట. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు కూర్మావతారం దాల్చి మునిగిపోకుండా సహకరించాడు. అలాంటి తాబేలు ప్రతిమను ఇంట్లో ఉంచుకుంటే సుఖశాంతులు నెలకొంటాయని విశ్వాసం.

ఇంట్లో క్రిస్టల్ తాబేలు ఉన్నా కూడా చాలా మంచిదట. అయితే దానిని ఏ వైపు పెట్టుకుంటే శుభప్రదమో తెలుసుకుందాం. ఇంట్లోని వారికి అదృష్టాన్ని తెచ్చిపెట్టే క్రిస్టల్ తాబేలును ఉత్తర దిశలో పెట్టుకుంటే ఇంట్లోకి పాజిటివ్ ఎన‌ర్జీ వ‌స్తుంది. ఎందుకంటే ఉత్తర దిక్కుకి అధిపతి కుబేరుడు. కనుక క్రిస్టల్ తాబేలు ఉత్తర దిశ‌ను చూస్తున్నట్లు పెడితే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉండవట. నైరుతి దిశలో పెడితే భార్యాభర్తల మధ్య కలహాలు సమసిపోతాయట. క్రిస్టల్ తాబేలును ఫౌంటెను దగ్గరలో కానీ.. నీటి తొట్టెలో కానీ ఉంచితే ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీతో సమస్యలన్నీ దూరమవుతాయి. ఆగ్నేయం, ఈశాన్య దిక్కుల్లో మాత్రం క్రిస్టల్ తాబేలును పెట్టవద్దట. అలా పెడితే వ్యతిరేక ఫలితాలుంటాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

Share this post with your friends