మహా కుంభమేళా వచ్చే ఏడాది జరగనుంది. మహా కుంభమేళా పన్నెండేళ్లకోసారి జరగనున్న విషయం తెలిసిందే. బృహస్పతి కదలిక ఆధారంగా పన్నెండేళ్లకోసారి కుంభమేళ జరుగుతూ ఉంటుంది. బృహస్పతి ఒక్కో రాశిలో ఏడాది పాటు చొప్పున 12 రాశులు తిరిగి బృహస్పతినే చేరుకునేందుకు 12 ఏళ్లు పడుతుంది కాబట్టి మహా కుంభమేళా 12 ఏళ్లకోసారి నిర్వహిస్తూ ఉంటారు. బృహస్పతి పన్నెండు సంవత్సరాల సంచారం.. పునరావృతం కుంభ రాశి ప్రధాన ఆధారంగా చేసుకుని కుంభమేళా తేదీలను నిర్వహించడం జరుగుతుంది. ఈ కుంభమేళాను ఆది శంకరాచార్యులు 850 ఏళ్ల క్రితం ప్రారంభించారు.
ఇక 12కు మరో ప్రత్యేకత కూడా ఉంది. దేశానికి.. దేశానికి సమయంలో వ్యత్యాసం ఉన్నట్టే దేవతలకు.. మానవులకు మధ్య కూడా సమయ వ్యత్యాసం ఉందట. కాబట్టి దేవతల పన్నెండు రోజులు మానవులకు పన్నెండు సంవత్సరాలతో సమానం. సాగర మథనం సమయంలో అమృతం భాండం కోసం దేవతలు, రాక్షసుల మధ్య యుద్ధం 12 రోజుల పాటు అంటే మానవుల లెక్క ప్రకారం 12 ఏళ్ల పాటు సాగిందట. అందుకే 12 ఏళ్లకు ఒకసారి కుంభమేళా జరుపుకుంటారు. పైగా సాగర మథనం సమయంలో అమృతం చుక్కలు పడ్డాయట. వాటిలో ఎనిమిది చుక్కలు స్వర్గంపై.. నాలుగు భూమిపై పడ్డాయట. అమృతం భూమిపై పడిన ప్రదేశాలు వచ్చేసి.. ప్రయాగ్‌రాజ్, హరిద్వార్, ఉజ్జయిని , నాసిక్. కాబట్టి ఈ నాలుగు చోట్ల మహా కుంభమేళ జరుగుతూ ఉంటుంది.