జపం చేయదలిస్తే ఇలా మాత్రం అస్సలు చేయకండి..

మనిషి జీవితంలో ఉన్నత స్థితికి ఎదగాలంటే క్రమశిక్షణ ఎంతో అవసరం. మరి అదెలా వస్తుందంటారా? ధ్యానం లేదా జపం చేయడం ద్వారా వస్తుంది. పట్టుమని పది నిమిషాల పాటు కుదురుగా ఉండలేని వారు సైతం ధ్యానం కారణంగా ఎంత సేపైనా ఒక విషయంపై ఏకాగ్రతతో ఉంటారు. ఏదైనా దేవత పేరునో మంత్రాన్నో పదే పదే ఉచ్చరిస్తూ పూర్తి ధ్యాసంతా ఆ మంత్రంపైనే పెడితే మన బాడీలో ఒక రకమైన వైబ్రేషన్స్ సొంత చేసుకోవడం ఖాయం. వాస్తవానికి ఇది ఒక్కరోజుతో వచ్చేది కాదు.. కొన్ని రోజుల పాటు దీనిపై ఫోకస్ పెట్టాలి. ఆ తరువాత మనం ఊహించలేని ఫలితం దక్కుతుంది.

ఇక జపాన్ని ఎలా చేయాలంటే.. ఎక్కడ పడితే అక్కడ కూర్చొని చేయకూడదు. వెదురు తడకపై కూర్చుని చేస్తే దారిద్ర్యము సంభవిస్తుందట. అలాగే రాతిపై కూర్చుని చేస్తే రోగాలు అంటుకుంటాయట. నేలపై కూర్చొని చేస్తే దు:ఖం, కొయ్యపీటపై కూర్చుని చేస్తే దౌర్భాగ్యం, గడ్డితో చేసిన చాపపై కూర్చొని జపం చేస్తే చిత్తచాపల్యము కలుగుతాయట. కాబట్టి వీటిపై కూర్చొని అసలు జపం చేయవద్దట. జింక చర్మముపై కూర్చొని జపం చేస్తే జ్ఞానసిద్ధి కలుగుతుందట. అందుకే యోగులు, సన్యాసులంతా జింక చర్మంపైనే కూర్చొని చేస్తుంటారు. పులితోలుపై కూర్చొని చేస్తే మోక్షం కలుగుతుంది. వస్ర్తంపై కూర్చొంటే ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. కంబళిపై కూర్చొని జపం చేస్తే దు:ఖ విముక్తి కలుగుతుందట.

Share this post with your friends