ఈ శివయ్యను దర్శించుకుంటే తప్పక సంతానం కలుగుతుందట..

శివుని ద్వాదశ జ్యోతిర్లింగాలకు చాలా ప్రత్యేకత ఉంది. జ్యోతిర్లింగాలకు మొక్కితే మనం కోరిన కోరిక తప్పక నెరవేరుతుందట. శివుడిని భోళా శంకరుడని అంటారు. భక్తితో చిన్న పాత్రలోని నీటితో అభిషేకించినా చాలు.. పొంగిపోయి వరాల జల్లు కురిపించేస్తూ ఉంటాడు. ప్రతి గ్రామంలోనూ శివుడి క్షేత్రాలు తప్పక ఉంటాయి. ఒక్కో క్షేత్రానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అయితే జ్యోతిర్లింగాలు మాత్రం 12 ఉన్నాయి. ప్రతిదీ ఓ ప్రత్యేకతను కలిగి ఉంది. ఇప్పుడు మనం చెప్పుకునే జ్యోతిర్లింగం మరింత స్పెషల్. ఈ జ్యోతిర్లింగాన్ని సంతానం లేని ఏ జంట అయినా సరే.. పూజిస్తే చాలు తప్పక సంతానం కలుగుతుందని నమ్మకం.

ఈ జ్యోతిర్లింగ క్షేత్రం మహారాష్ట్రలోని దౌల్తాబాద్‌లోని బెరల్‌గావ్‌లో ఉంది. ఈ ఆలయంలోని స్వామివారిని ఘుష్మేశ్వరుడు అని పితుస్తారు. ఇక ఈ ఆలయాన్ని ఘుష్మేశ్వర జ్యోతిర్లింగ ఆలయం అని కూడా అంటారు. అజంతా, ఎల్లోరా గుహలకు సమీపంలో ఉన్న ఈ శివలింగం శివుని పట్ల భక్తులకు ఉన్న నిజమైన భక్తికి చిహ్నం. ఆ భక్తురాలి పేరు మీదుగా ఈ శివలింగానికి ఘుష్మేశ్వర అని పేరు వచ్చింది. ఇక్కడి స్వామివారిని పూజిస్తే తప్పక సంతానం లేని వారికి సంతానం కలుగుతుందట. జ్యోతిర్లింగాలలో ఘుష్మేశ్వర ఆలయం ఆఖరిది. ఘృష్ణేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే కానీ జ్యోతిర్లింగ యాత్ర సంపూర్ణం కాదు అని నమ్మకం.

Share this post with your friends