ఇక్కడి శివయ్య విగ్రహం ముందు నిద్రిస్తే తప్పక సంతానం లభిస్తుందట..

పిల్లల కోసం చాలా మంది దంపతులు ఆవేదన చెందుతుంటారు. ఎన్నో ఆసపత్రుల చుట్టూ తిరుగుతుంటారు. అయితే కొన్ని ఆలయాలను సందర్శించినా.. లేదంటే కొన్ని ఆలయాల్లో ప్రసాదం స్వీకరించినా.. లేదంటే కొన్ని ఆలయాల్లో నిద్ర చేసినా.. కొన్ని ఆలయాల్లోని కొలనులో నీటిని తాగినా తప్పక సంతానం కలుగుతుందని నమ్మకం. అలాంటి అద్భుతమైన ఆలయాలు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉన్నాయి. కార్తీకమాసంలో ఏలూరు జిల్లా కామవరపుకోట మండలంలో గుంటుపల్లి గుహలకు మూడవ సోమవారం నాడు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారు.

అంతేకాకుండా ఇక్కడి శివుడి విగ్రహం ముందు మహిళలు రాత్రి పూట నిద్ర చేస్తారు. ఆసక్తికర విషయం ఏంటంటే.. మహిళలు నిద్ర చేసిన సమయంలో వారికి కలలో పిల్లలు ఆడుకునే బొమ్మలు లేదా వస్తువులు కనిపిస్తే తప్పక సంతాన భాగ్యం కలుగుతుందట. ఇక సంతాన భాగ్యాన్ని ఇచ్చే మరికొన్ని ఆలయాలు కూడా ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలోని శివదేవుని చిక్కాల గ్రామంలో శివరాత్రి రోజు అక్కడి పురాతన శివాలయంలో మొక్కలు నాటుతారు. ఇక్కడ కొబ్బరి మొక్క లేదంటే గులాబి మొక్క నాటితే సంతా భాగ్యం తప్పక కలుగుతుందట. ముఖ్యంగా మగ పిల్లవాడు కావాలంటే కొబ్బరి మొక్క.. ఆడపిల్ల నాటితే గులాబి మొక్క నాటాలట.

Share this post with your friends