మధ్యప్రదేశ్‌లోని షిప్రా నది ఒడ్డున ఓ ఆలయం ఉంది. ఇది మంగళ దోష విముక్తికి అద్భుతమైన ఆలయం. ఇక్కడికి వెళితే చాలు చాలా మంచి జరుగుతుందని నమ్మకం. ఉజ్జయినిలో ఉన్న షిప్రా నదని శిప్రా నది అని కూడా పిలుస్తారు. ఈ నదీ తీరంలో హిందూ పుణ్యక్షేత్రాలకు కొదువేమీ లేదు. ఇక్కడంతా ఆధ్యాత్మికత వెల్లివిరుస్తూ ఉంటుంది. మంగళ దోష విముక్తి కోసం ఎక్కడెక్కడి నుంచో భక్తులు ఈ ఆలయానికి వస్తూ ఉంటారు. మంగళనాథుని పేరుతో ఇక్కడ శివుడు కొలువై ఉన్నాడు. ఆలయ గర్భగుడిలో లింగ రూపంలో శివుడు నిత్యం పూజలందుకుంటూ ఉంటాడు.
ఉజ్జయిని నగరం జ్ఞానానికి సంబంధించిన గొప్ప కేంద్రమని అంటారు. అలాగే ఉజ్జయినిలోని మహాకాళ ఆలయం, మంగళనాథ ఆలయం రెండూ కూడా ఖగోళ శాస్త్ర అధ్యయన కేంద్రాలుగా పరిగణించబడుతున్నాయి. ఇక్కడ మంగళ శాంతి కోసం పూర్ణ క్రతువులతో భక్తులు పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడి శివయ్యను పూజించుకుంటే చాలట. ఎలాంటి అశుభ కార్యమైనా మంగళకరంగా భావించబడుతుందట. స్థల పురాణం ప్రకారం శివుడికి.. అంధకాసురుడికి జరిగిన భీకర యుద్ధంలో అంగారకుడు పుట్టాడని తెలుసుకన్నాం కదా.. ఆ అంగారకుడి ఆలయమే ఇది. దీనిలో శివుడు మంగళనాథుడిగా పూజలు అందుకుంటున్నాడు.