శ్రావణ మాసంలో సోమవార వ్రతం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇవాళ శుక్ల యోగం, స్వాతి నక్షత్రాల కలయికతో శ్రావణ సోమవారం మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. అయితే ఇవాళ భద్ర నీడ ఏర్పడనుంది కాబట్టి సమయం విషయంలో కాస్త జాగ్రత్త వహించాలి. ఈ శ్రావణ సోమవారం రోజున పరమేశ్వరుడికి ప్రత్యేక పూజ చేసుకోవడంతో పాటు జలాభిషేకం, రుద్రాభిషేకం చేయడం విశేష ఫలితాలను ఇస్తుంది. ఈ శ్రావణ మాసంలో శివపార్వతులను పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ మాసంలో శ్రావణ సోమవారం నాడు కూడా వ్రతం నిర్వహిస్తూ ఉంటారు. మరి ఈ రోజున ఎవరు వ్రతం చేయాలో తెలుసా?
శ్రావణ సోమవారం వ్రతాన్ని పెళ్లి కాని యువతీయువకులు చేయాలట. ఇది వివాహంలో ఏర్పడే అడ్డంకులను తొలగిస్తుందట.శివానుగ్రహం కోసం ప్రత్యేక వస్తువులతో అభిషేకిస్తే వివాహ అకాశాలు మరింత పెరుగుతాయట. ఈ నెలంతా పరమేశ్వరుడు భూమిపైనే ఉంటాడని నమ్మకం. కాబట్టి శివుడిని ఈ నెలలో ఆరాధించడంతో పాటు ఉపవాసం ఉండటం వల్ల జీవితంలోని సమస్యలన్నీ తొలగిపోయి ప్రశాంత జీవనం అలవడుతుందట. ఇవాళ రోజంతా శుభ యోగాలు ఏర్పడ్డాయి. కాబట్టి శివుడికి అభిషేకం చేసే విషయంలో సమయంతో పని లేదు. ఏ సమయంలోనైనా సంతోషంగా అభిషేకం చేయవచ్చు.