
వరలక్ష్మీ వత్రం ముగిసిన తరువాత ముత్తైదువులను ఐదుగురిని కానీ తొమ్మిది మందిని కానీ లేదంటే 11 మందిని కానీ ఇంటికి ఆహ్వానించాలి. వారికి ముందు బొట్టు పెట్టి, గంధం రాసి వారి కాళ్లకు నిండుగా పసుపు రాయాలి. ఇక్కడి వరకూ అందరికీ తెలిసిందే. ఆ తరువాత అందరికీ వాయినం ఇవ్వాలి. ‘‘వాయనం ఇచ్చేటప్పుడు.. “ఇందిరా ప్రతి గృహ్నాతు ఇందిరా వైదదాతిచ ఇందిరా తారికావాభ్యమ్ ఇందిరాయై నమోనమః..” అనే శ్లోకాన్ని పఠిస్తూ వచ్చిన వాయనం ఇవ్వాలి. ఆ తరువాత అక్షింతలను వారికి అందించి వారి కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవాలి.
ఇక ఇంటికి వచ్చిన వారిలో ఎవరైనా వ్రతం చేసుకున్న వారికంటే తక్కువ వయసున్న మహిళలుంటే ఏం చేయాలి? వారి కాళ్లకు నమస్కరించ కూడదు కదా.. అనే సందేహం వస్తుంది. ఒకవేళ వాయనం ఇచ్చే వారిలో చిన్నవారు ఎవరైనా ఉంటే వారి ఆశీర్వాదం కోసం అక్షతలు వారి చేతిలో పెట్టాలి. ఆపై వారి గాజులకు నమస్కరించాలి. ఆ తరువాత అక్షితలను తీసుకుని తలపై వేసుకోవాలి. వాయనం ఇచ్చేటప్పుడు నిండు మనసుతో ఇవ్వాలట. అలా చేస్తేనే సత్ఫలితం ఉంటుందట. సంపద అంటే ధనం రూపంలోనే కాకుండా అన్ని విధాలుగా ధాన్యం, పుశు, గుణ జ్ఞాన సంపద వంటివెన్నో లక్ష్మీదేవి వ్రతమాచరించిన వారికి అందిస్తుందట.
