సంతానం లేనివారు రామాయణంలోని బాలకాండలో 15, 16 సర్గలను పఠించాలని తెలుసుకున్నాం. వాటిని పుత్ర కామేష్టి సర్గలని అంటారు. మరి పుత్ర కామేష్టి పారాయణ వ్రతాన్ని ఎలా పఠించాలి అంటారా? దీనికోసం సంతానం లేని దంపతులు ముందుగా శుచిగా స్నానమాచరించి పూజా మందిరంలో శ్రీ రాముడి విగ్రహాన్ని పూలతో అలంకరించి భక్తి శ్రద్ధలతో రామ రక్ష స్తోత్రం పఠించాలి. తర్వాత బాలకాండలోని 15, 16 సర్గలలో ఉన్న శ్లోకాలను పారాయణం చేయాలి. పారాయణం పూర్తయ్యాక ధూప, దీప. నైవేద్యాలను స్వామివారికి సమర్పించాలి. మరి కొందరికి సంస్కృతం చదవడం రాదు కదా.. దానికి ఏం చేయాలి అంటారా?
బయట మార్కెట్లో లభించే పాటల సీడీలు కానీ లేదంటే ఇంటర్నెట్‌ను వినియోగించుకుని కానీ శ్లోకాలను వినవచ్చట. నియమ నిష్టలతో పారాయణం చేస్తే చాలు.. మంచి ఫలితం ఉంటుందట. ఇక రాముల వారికి పాలు, బెల్లంతో తయారు చేసిన పరమాన్నం నైవేద్యంగా సమర్పించాలి. పారాయణ వ్రతానికి ముందుగానే ఈ పాయసాన్ని స్వామివారి ముందు పెట్టాలట. అలా చేస్తే శ్లోకాల శక్తి కూడా నైవద్యానికి చేరుతుంది. దానిని స్వీకరించిన దంపతులకు తప్పక సంతానం లభిస్తుందట. ఇక దీనిని 20 రోజుల పాటు చేయాలట.