దేవుళ్లందరికీ ఏదో ఒక రోజున ఉపవాసం ఉండటం సర్వసాధారణం. అయితే సాయిబాబాకు ఉపవాసం ఉంటారా? అంటే ఉంటారు. గురువారాల్లో సాయిబాబాను పూజించడమే కాదు.. చాలా మంది భక్తులు ఆ రోజు ఉపవాసం ఉంటారు. ఉపవాసం ఉండలేని వారు కనీసం నాన్ వెజ్‌కు అయినా దూరంగా ఉంటారు. సాయిబాబాను హిందూ, ముస్లింలంతా పూజిస్తారు. నిత్యం సాయి నామం జపిస్తే ఇబ్బందులే ఉండవని అంలారు. ఇక సాయిబాబా వ్రతం ఆచరిస్తే వ్యాపారాలు విజయవంతంగా పూర్తవుతాయని చెబుతారు. మరి సాయిబాబా కోసం ఎన్ని రోజుల పాటు ఉపవాసం ఉండాలి? ఎప్పుడు ఉండాలో చూద్దాం.
నెలలో ఏ గురువారం నుంచి అయినా సాయిబాబా కోసం ఉపవాసాన్ని ప్రారంభించవచ్చు. 5 వారాల పాటు.. లేదంటే 7, 9, 11 లేదా 21 గురువారాలు సాయిబాబా కోసం ఉపవాసం ఉండవచ్చు. ఇలా ఉంటే మన కోరికలు నెవేరుతాయని నమ్మకం. ఉపవాసం ఉన్నప్పుడు మనశ్శాంతి చాలా ముఖ్యం. ప్రశాంతంగా ఉపవాసముంటూ సాయిబాబాను పూజించాలి. సాయిబాబా ఉపవాసం సమయంలో నీరు తాగకూడదన్న నియమేమీ లేదు. సాయి పూజ తర్వాత పండు తినవచ్చు. పండు తినేసి ఉండలేని వారు ఒక పూట భోజనం చేయవచ్చు. ఒకవేళ ఒక గురువాసం ఉపవాసం చేయకుంటే.. దానిని లెక్కించకూడదు.