
వ్రత పురాణాల ప్రకారం దీపావళి ఐదు రోజులు ఆచరించాలి. ప్రతి దినానికి ఒక ప్రత్యేకత ఉంది. తొలి రెండు రోజులు ముందుగా ఏం చేస్తారో తెలుసుకుందాం. తొలి రొండు రోజులు వచ్చేసి, త్రయోదశి అలాగే నరక చతుర్దశి. శాస్త్ర పక్రారం ఈరెండు రోజులను జరుపుకోవాల్సిన విధానం ఏంటంటే..
త్రయోదశి – యమదీపం
అపమృత్యు నివారణార్థం దీపాన్ని వెలిగించి ఇంటి ముంగిట ఉంచాలి. దీన్ని యమదీపం అంటారు; పితృదేవతలకు సంతృప్తి కలుగుతుంది, ఆయురారోగ్యాలు ప్రసాదిస్తాయని శాస్త్రవచనం.
చతుర్దశి – నరక చతుర్దశి
సూర్యోదయానికి ముందు అభ్యంగస్నానం చేయాలి.
మట్టి పెల్లలతో ఉన్న ఉత్తరేణి కొమ్మలతో గృహస్థునికి దిష్టి తీర్చడం శ్రేయస్కరం.
ఈ రోజున యమునా దేవికి దీపారాధన చేయాలి – పితృప్రసన్నత కోసం మంగళకరము.
