అన్నాచెల్లెళ్ళ పండగ గురించి మనం తెలుసుకున్నాం. ఈ రోజున సోదరీమణులు ఉదయాన్నే నిద్రలేచి.. శుచిగా స్నానమాచరించి కొత్త బట్టలు ధరించాలి. ఒక ప్లేటులో పసుపు, కుంకుమ, చందనం, అక్షితలు, తమలపాకులు, స్వీట్లు పెట్టాలి. అనుకూలమైన సమయం మధ్యాహ్నం 1:19 నుంచి 3:22 వరకు ఉంటుందనుకున్నాం కాబట్టి ఆ సమయంలో సోదరుడిని కూర్చోబెట్టి ముందుగా ఉంగరం వేలితో అన్న లేదా తమ్ముడికి తిలకం దిద్దాలి.ఆ తరువాత తిలకంపై అక్షితలు అద్దాలి.
ఆ తరువాత సోదరుడికి కొబ్బరికాయను ఇవ్వాలి. అనంతరం సోదరుడికి స్వీట్ తినిపించి హారతి ఇవ్వాలి. ఇలా చేస్తే సోదరుడు సంతోషంగా, శ్రేయస్సు, దీర్ఘాయువుతో ఉంటాడని నమ్మకం. అన్నాచెల్లెళ్ళ పండగను అన్నా చెల్లెళ్ళు.. అక్క తమ్ముళ్ళ మధ్య ప్రేమకు చిహ్నంగా జరుపుకుంటారు. ఇది రాఖీ పండుగ మాదిరిగానే ఉంటుంది. ఇక పూజంతా ముగిసిన తర్వాత సోదరులు తమ సోదరిని ఎటువంటి సందర్భం ఎదురైనా తోడుగా ఉండి కాపాడుతామని హామీ ఇచ్చి బహుమతులు ఇస్తారు.