గౌరీ పూజను ఎన్ని రోజుల పాటు చేస్తారు? ఎలా చేస్తారు?

జ్యేష్ఠ గౌరీ పూజ ఎవరు చేసుకోవాలి? ఎప్పుడు చేసుకోవాలి? వంటి విషయాలన్నీ తెలుసుకున్నాం కదా. ఇప్పుుడు జ్యేష్ట గౌరీ పూజను ఎన్ని రోజుల పాటు చేసుకోవాలి? ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. జ్యేష్ట గౌరీ పూజను మూడు రోజుల పాటు చేసుకోవాల్సి ఉంటుంది.
మూడు రోజుల పూజ..

మొదటి రోజు – గౌరీ దేవిని ఇంటికి ఆహ్వానించాలి.

రెండవ రోజు – శాస్త్రోక్తంగా పూజించి మహానైవేద్యం సమర్పించాలి.

మూడవ రోజు – గౌరీదేవిని నదీ జలాల్లో లేదా చెరువులో నిమజ్జనం చేయాలి.

ఈ పూజలో 16 సంఖ్యకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. అదేంటంటే.. 16 దీపాలు వెలిగించడం, 16 రకాల నైవేద్యాలు సమర్పించడం, 16 రకాల పూలతో అలంకరించడం వంటివి.

పూజా విధానం..

మొదటిరోజు – పూజా మందిరం శుభ్రపరచి గౌరీదేవి ప్రతిమను ఇంటికి తీసుకురావాలి. కొన్ని ప్రాంతాలలో గంగాదేవిని కూడా ఆ రోజున పూజిస్తారు.

రెండోరోజు – సూర్యోదయానంతరం లేచి శివపార్వతుల చిత్రాలను అలంకరించి, ముందుగా గణపతి పూజ చేసి, తర్వాత గౌరీదేవిని పసుపుతో తయారు చేసి అర్చించాలి. గంగాజలంతో శివుని అభిషేకించాలి. పిండివంటలు, పండ్లు, కొబ్బరికాయలు నైవేద్యంగా సమర్పించాలి. అనంతరం ఒక ముత్తైదువుకు వాయనం ఇవ్వాలి. పూజ పూర్తయ్యే వరకు ఉపవాసం ఉండాలి.

మూడోరోజు – గౌరీదేవికి పూజ చేసి, నదీ జలాల్లో లేదా చెరువులో నిమజ్జనం చేయాలి.

మంత్ర జపం..

ఈ పూజ చేసుకోలేని వారు మనఃపూర్వకంగా అమ్మవారి మంత్రం ఓం శ్రీ మాత్రే నమః” అని మూడు రోజులూ జపిస్తే సంపూర్ణ ఫలితం లభిస్తుంది.

Share this post with your friends