ఆర్థోపెడిక్ హనుమంతుడి ఆలయంలో ఎలా చికిత్సను అందిస్తున్నారంటే..

ఆర్థోపెడిక్ హనుమంతుడి గురించి తెలుసుకున్నాం కదా. ఈ ఆంజనేయుడు మధ్యప్రదేశ్ కట్ని జిల్లా నుంచి 35 కి.మీ దూరంలో ఉన్న ముహాసాలో హనుమంతుడు కొలువై ఉన్నాడు. ఈ ఆలయంలో ఇచ్చే మూలికలను నమలడం ద్వారా విరిగిన ఎముకలు కట్టుకుంటాయని నమ్మకం. మనుషుల ఎముకలే కాదు.. జంతువుల ఎముకలు సైతం ఈ మూలికలు తింటే కట్టుకుంటాయట. ఈ ఆలయం గురించి తెలిసిన పేషెంట్స్.. అంబులెన్స్‌లో వచ్చి మరీ ఆర్థోపెడిక్ హనుమంతుడి చికిత్సను పొంది స్వస్థతతో తిరిగి వెళతారని చెబుతారు.

ఈ ఆలయ చరిత్ర ఏంటంటే.. ఇక్కడ ఔషధాన్ని 40 సంవత్సరాల క్రితం ఒక సాధువు ఈ ఆలయ పూజారికి ఇచ్చాడట. ఆ తరువాత.. ఆలయ పూజారి భక్తులకు ఇవ్వడం ప్రారంభించాడట. ఈ ఔషధం తీసుకోగానే భక్తులకు ఉపశమనం కలిగేదట. అలా ఇదొక ఆనవాయితీగా మారిపోయింది. ఇక్కడికి భక్తులు రాగానే రామ నామం జపించమని చెబుతారు. ఆపై కళ్లు మూసుకోమని చెప్పి నోటిలో ఓ మూలిక వేస్తారు. దానిని నమిలి తినాల్సి ఉంటుంది. ఇక్కడికి వచ్చి ఈ మూలికను తిన్న వారికి తప్పక నయమవుతుందట.

Share this post with your friends