కన్నయ్య ఇచ్చిన బంగారు నాణేలతో ఆ పేదవాడి దశ ఎలా తిరిగిందంటే..

కొన్ని కథలు చాలా ఆసక్తికరంగానూ.. సందేశాత్మకంగానూ అనిపిస్తాయి. అలాంటి కథనే ఒకదానిని పోతన భారతంలోని ఓ చిన్న సంఘటన ద్వారా వివరించాడు. అదేంటో తెలుసుకుంటాం. ఆపదలో ఉన్నవారికి సాయం చేస్తే కలిగే ఫలితం గురించి తెలిపే కథ అది. ఒకసారి కృష్ణార్జునులు కలిసి వెళుతుండగా ఓ నిరుపేద బ్రాహ్మణుడు యాచకునిలా కనిపించాడు. అర్జనుడు దయతో అతనికి ఒక సంచి నిండా బంగారు నాణేలిచ్చాడు. అర్జనుడు ఇచ్చిన బంగారు నాణేలను సంతోషంగా తీసుకుని వెళుతుండగా బ్రాహ్మణుడి నుంచి ఓ దొంగ వాటిని కత్తితో బెదిరించి తీసుకున్నాడు. తిరిగి బ్రాహ్మణుడు భిక్షాటన చేయడం ఆరంభించాడు. ఆ తరువాత ఒకరోజు అర్జనుడు ఆ బ్రాహ్మణుడిని చూసి ఆశ్చర్యపోయాడు. విషయం తెలుసుకుని తిరిగి అతని చేతికి వజ్రం ఇవ్వగా దానిని తన ఇంట్లోని కుండలో దాచాడు.

ఉదయం లేచేవరకూ ఆ కుండతో బ్రహ్మణుడి భార్య నదికి నీటికోసం వెళ్లింది. కుండలో చూస్తే వజ్రం లేదు. తిరిగి బ్రాహ్మణుడు భిక్షాటన చేస్తుండగా.. అర్జనుడు చూసి ఇక అతనికి సాయం అనవసరం అనుకున్నాడు. కానీ కృష్ణుడు మాత్రం ఈసారి తాను సాయం చేస్తానని రెండు బంగారు నాణేలిచ్చాడు. అప్పటికే నిరాశలో ఉన్న బ్రాహ్మణుడు వాటిని చేపలు విక్రయిస్తూ పుట్టెడు కష్టాల్లో ఉన్న వ్యక్తికి ఇచ్చి ఒక చేపను తీసుకుని ఇంటికెళ్లాడు. దానిని చూసిన బ్రాహ్మణుడి భార్య చేప గొంతులో ఏదో ఉందని చూడగా అది తాము పోగొట్టుకున్న వజ్రం. ఆనందంతో దొరికిందని గంతులేస్తుండగా అటుగా వచ్చిన దొంగ తాను బంగారు నాణేలు కొట్టేసిన విషయం తెలిసిందనుకుని వాటిని తిరిగి ఇచ్చేశాడు. తను చేపలమ్మే వ్యక్తికి చేసిన ఒక సాయంతో తను పోగొట్టుకున్నవన్నీ తిరిగొచ్చేసరికి ఆ పేద బ్రహ్మణుడి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

Share this post with your friends