తులసి మొక్క ఎండిపోయిందా? పొరపాటున కూడా ఇలా చేయకండి..

హిందువుల ఇళ్లలో తులసి మొక్కను పెంచుకుంటూ ఉంటారు. నిత్యం తులసికి పూజ చేసిన మీదటే పనులు మొదలు పెడతారు. ఇక చెట్లు, మొక్కలు అన్నాక ఎండిపోతూనే ఉంటాయి. అయితే తులసి మొక్క ఎండిపోతే మాత్రం ఏదో కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. తులసి మొక్కను లక్ష్మీ దేవి స్వరూపంగా భావిస్తూ ఉంటారు. తులసి మొక్కకు క్రమం తప్పకుండా నీటిని సమర్పిస్తూ పూజ చేసుకుంటూ ఉండాలి. అలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. తద్వారా ఆర్థిక లాభాలు, శాంతి లభిస్తాయని నమ్మకం. తులసి మొక్క వాడిపోయినా.. ఎండిపోయినా మనసుకు కాస్త ఇబ్బందికరంగా అనిపిస్తుంది.

ఇలా ఎండిపోయిన మొక్కను తీసివేయాలట. దానిని ఇంట్లో ఉంచుకోకూడదు. అలాగని ఎలా పడితే అలా పీకి పారేయకూడదు. దానికి కూడా కొన్ని నియమాలున్నాయి. ఎండిన మొక్కే కదాని తులసి మొక్కను విసిరి పడేయకూడదు. లేదంటే మంటలో వేసి కాల్చడం వంటివి చేయకూడదు. ఎండిన తులసి మొక్కను భూమి కింద పాతి పెట్టాలి. పొరపాటున కూడా రాత్రి సమయాల్లో తులసిని ఇంటి నుంచి తీసి బయట పడేయకూడదు. తులసి మొక్కను పొరపాటున కూడా పాదాలతో తాకవద్దు. అలాగే చెత్త బుట్టలో పడేయకూడదు. మొక్కను పీకేసిన వెంటనే దాని స్థానంలో కొత్త మొక్కను నాటాలి.

Share this post with your friends