భక్తుల బాధలను ఇట్టే పరిష్కరించే “హరసిద్ధి మాత & గడ్ కాళికా దేవి” ఆలయాలు : Ujjain Shakthi Peeth Temples Vlog

వెల్కమ్ బ్యాక్ టు భక్తి టీవీ వ్లాగ్స్…

భక్తి టీవీ వ్లాగ్స్ లో భాగంగా ఈ వారం మీకు చూపించబోయే ఆలయం ఆధ్యాత్మిక రాజధానిగా పేరుగాంచిన ఉజ్జయిని నగరంలో ఉన్న రెండు మహిమాన్విత శక్తి పీఠాలు. ఉజ్జయిని అంటే అందరికి గుర్తొచ్చే ఆలయం జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన శ్రీ మహాకాళేశ్వరుని ఆలయం. ఇక్కడ జరిగే భస్మ హారతి ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాశస్త్యం కలిగినది. మనుష్యులు ఎంత సాధించిన చివరకు బూడిదగా మారడం తప్పదనే సందేశం ఆ భస్మ హారతిలో కనిపిస్తుంది. మహాకాళేశ్వరునితో పాటు ఇక్కడ శక్తి స్వరూపమైన, భక్తులు కోరిన కోరికలు తీర్చి, వారి బాధలను పోగొట్టే ఇద్దరు మహిమాన్వితమైన అమ్మవావార్లు పూజలు అందుకుంటున్నారు. ఒక అమ్మవారి ఆలయం 51 శక్తిపీఠాల్లో ఒకటైన శ్రీ హరసిద్ధి మాత ఆలయం. రెండవ ఆలయం అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన శ్రీ గడ్ కాళికాదేవి అమ్మవారు.

Watch Harasiddhi Matha & Gad Kalika Mata Ujjain Shakthi Peeth Temples Vlog

ఈ రెండు ఆలయాల చరిత్ర, అమ్మవారి ఆలయాల్లో జరిగే పూజలు, తెలుగు రాష్ట్రాల నుంచి ఇక్కడకు చేరుకునే విధానం అన్నీ క్లియర్ గా ఈ వ్లాగ్ లో ఉన్నాయి. ఈ వీడియో లో మొదట హరసిద్ధి మాత ఆలయం గురించి, తరువాత ఈ ఆలయానికి కేవలం 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న గడ్ కాళికా అమ్మవారి ఆలయం గురించి, ఇక్కడే శ్రీకృష్ణుడు, బలరాముడు 64 రోజులు పాటు నివసించి విద్య అభ్యసించిన మహర్షి సందీపని ఆశ్రమం గురించి, కాలభైరవ ఆలయం గురించి కూడా డిటైల్డ్ గా చెబుతాను. వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరుకు క్లియర్ గా చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ బంధు మిత్రులకు షేర్ చేయండి. మరిన్ని పుణ్యక్షేత్రాల వీడియోల కోసం మా భక్తి టీవీ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే భక్తివిశేషాల కోసం మా వెబ్సైటును ఫాలో అవ్వండి.

Watch Sri Krishna Janmashtami 2024 Special Vlog : భూలోక బృందావనం.. హైదరాబాద్ ఇష్కాన్ (ISKCON) లో 24 గంటలు

Watch Hyderabad Vijaynagar Colony Sri Lakshmi Ganapathi Temple Vlog : శివుడితో కలిసి వినాయకుడు వెలసిన ఏకైక క్షేత్రం

Share this post with your friends