తిరుమల శ్రీవారి ప్రసాదమైన లడ్డూలకు ప్రపంచ వ్యాప్తంగా ప్రాధాన్యత ఉంది. ప్రతి ఒక్కరూ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ప్రసాదాన్ని చాలా ఇష్టంగా స్వీకరిస్తారు. అప్పట్లో అయితే స్వామివారి ప్రసాదం భక్తులకు పెద్దగా అందుబాటులో ఉండేది కాదు. కానీ ఇప్పుడు తిరుమలకు వెళితే ఎన్ని లడ్డూలు కావాలంటే అన్ని లడ్డూలు ఇస్తున్నారు. అయితూ ఇటీవలి కాలంలో శ్రీవారి లడ్డూలను హైదరాబాద్‌లో కూడా విక్రయిస్తున్నారు. అయితే ఒక్కో భక్తుడికి ఒక్క లడ్డు మాత్రమే నిన్న మొన్నటి వరకూ విక్రయించేవారు. అలాగే కేవలం వారంలో రెండు రోజులు మాత్రమే లడ్డూ విక్రయించేవారు.
ఇప్పటి వరకూ భాగ్యనగరంలో కేవలం వీకెండ్స్ అయిన శని, ఆదివారాల్లో మాత్రమే లడ్డూలను విక్రయించేవారు. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల శ్రీవారి లడ్డూ ఇకపై అన్ని రోజులూ అందుబాటులోకి తీసుకు రావాలని నిర్ణయాంచారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు హిమాయత్‌నగర్, జూబ్లీహిల్స్‌లోని వేంకటేశ్వరస్వామి ఆలయాలు(టీటీడీ)లో రూ.50కే లడ్డూ ప్రసాదం అందుబాటులో ఉండనుంది. ఈ విషయాన్ని హిమాయత్నగర్టీటీడీ దేవాలయం ఇన్‌స్పెక్టర్లు శ్రీనివాస్ ప్రభు, నిరంజన్ తెలిపారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లోని పలు దేవాలయాల్లో లడ్డూలు అందుబాటులో ఉండనున్నాయి.