అమ్మవారిని ఈ పూలతో ఎట్టి పరిస్థితుల్లోనూ పూజించకూడదట..

శరన్నవరాత్రుల్లో భాగంగా దుర్గాదేవిని తొమ్మిది రోజులపాటు తొమ్మిది ప్రత్యేక రూపాలలో ఆరాధిస్తుంటారు. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు, ప్రసాదాన్ని సమర్పించి పూజిస్తాం. ముఖ్యంగా అమ్మవారిని కొన్ని ప్రత్యేక పూలతో పూజించాలి. ఈ నేపథ్యంలో వాడకూడని పుష్పాలేంటో తెలుసుకుందాం.

గరిక: దేవీ నవరాత్రుల్లో దుర్గాదేవిని గరికపోచలతో పూజించకూడదట. దీనికి కారణమేంటంటే.. దుర్గాదేవి ఉగ్ర స్వరూపిణి.. మరోవైపు గరిక ఉష్టాన్ని తగ్గిస్తుంది. కాబట్టి అమ్మవారి ఉగ్రతత్వాన్ని తగ్గించే గరికతో దుర్గమ్మను పూజించకూడదట.

మల్లెపూలు: చండీ అమ్మవారు కూడా ఉగ్రత్వంతో ఉంటుంది. మల్లెపూలకు శాంతింపచేసే గుణం ఉంటుంది కాబట్టి వాటితో పూజించకూడదట. ఆసక్తికర విషయం ఏంటంటే.. చండీ అమ్మవారికి కాకుండా ఇతర దేవతలను మల్లెపూలతే పూజిస్తే ఫలితం అద్భుతంగా ఉంటుందట. ఆర్థిక కష్టాలన్నీ తీరిపోయి సంతోషంగా జీవిస్తారట.

Share this post with your friends