ఈ పూలు లక్ష్మీదేవికి చాలా ఇష్టమట.. వీటితో పూజిస్తే..

చాలా మంది ఇంట్లో వివిధ రకాల పూల మొక్కలను పెంచుతుంటారు. అయితే ఈ మొక్కలను పెంచుకునే విషయంలో కొన్ని నియమాలను పాటిస్తే ఉత్తమమని పండితులు చెబుతున్నారు. పూల మొక్కలు ఇంటి ముందు ఉంటే.. ప్రశాంతతో పాటు.. ఇంటి వాతావరణం కూడా అందంగా మారిపోతుందనడంలో సందేహం లేదు. ఇంటి ఆవరణలో గన్నేరు పూల మొక్కలు కనిపిస్తూనే ఉంటాయి. చెట్టు నిండా పూలతో చాలా అందంగా ఉంటాయి. ఎరుపు, తెలుపు, పసుపు వంటి వివిధ రంగుల్లో ఉండే గన్నేరు పూలు పూస్తూ ఉంటాయి. వాటిని పూజకు వినియోగించడం సర్వసాధారణం.

అంతా ఓకే కానీ.. మరి గన్నేరు చెట్టును వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో పెంచుకోవచ్చా? ఇవి ఇంట్లో ఉంటే ఫలితాలు ఎలా ఉంటాయి? అనే అంశాలను చూ్దాం. గన్నేరు పూలతో భగవంతుడిని పూజించడం వలన ఇట్లో అశాంతులు తొలగిపోయి.. సంతోషాలు నెలకొంటాయట. ఇంట్లో గన్నేరు చెట్టు ఉంటే పాజిటివ్ ఎనర్జీ మాత్రమే ఇంట్లో ఉంటుందట. ముఖ్యంగా ఈ పూలు లక్ష్మీదేవికి చాలా ఇష్టమట. ఈ పూలతో లక్ష్మీ దేవిని పూజిస్తే ఇంట్లో సిరిసంపదలకు లోటుండదట. ఈ గన్నేరు చెట్టును ఇంట్లో చక్కగా పెంచుకోవచ్చట. దీని వల్ల ఎలాంటి దోషమూ ఉండదని పండితులు చెబుతున్నారు.

Share this post with your friends