ఆ క్రియాశీల అగ్నిపర్వతానికి వినాయకుడే కాపలా.. అస్సలు బద్దలుకానివ్వడట..

సృష్టినంతటినీ భగవంతుడు కాపాడుతాడని అంటారు. ముఖ్యంగా ఒక అగ్నిపర్వతానికి వినాయకుడు కాపలా ఉన్నాడు. ఇంతకీ ఎక్కడుందా అగ్నిపర్వతం అంటారా? ఆ వివరాలన్నీ తెలుసుకుందాం రండి. ఇండోనేషియా అగ్ని పర్వతాలకు నిలయం. ఇండోనేషియా తూర్పు జావా ప్రావిన్స్‌లోని బ్రోమో టెంగర్ సెమెరు జాతీయ ఉద్యానవనంలో ఉంది. ఉందీ అగ్నిపర్వతం. క్రియాశీల అగ్నిపర్వతం ఇది. దీనికి కాపలాగా వినాయకుడు న్నాడు. ఈ వినాయకుడు 700 ఏళ్లుగా అక్కడే ఉన్నాడు. అగ్నిపర్వత విస్ఫోటనం నుంచి నిరంతరం తమని గణేశుడు రక్షిస్తున్నాడని అక్కడి ప్రజలు చెబుతారు.

700 ఏళ్లుగా అక్కడ కొలువైన వినాయకుడు చురుకైన అగ్ని పర్వతం బద్దలు కాకుండా చూస్తున్నాడని నమ్ముతారు. సుమారు 700 సంవత్సరాల క్రితం టెంగర్ మాసిఫ్ తెగకు చెందిన పూర్వీకులు ఈ పర్వతం మీద గణేశ విగ్రహాన్ని ప్రతిష్టించారని అక్కడి వారి నమ్మకం. వీరంతా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ గణేషుడిని కొలుస్తుంటారు. నిత్యం క్రమం తప్పకుండా వినాయకుడికి పూజలు చేసి అనేక రకాల నైవేద్యాలు సమర్పిస్తారు. గణపతి పూజ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వీరు అశ్రద్ధ చూపరు. ఒకవేళ పొరపాటున పూజ చేయకుంటే అగ్ని పర్వతం బద్దలై తమని దహించి వేస్తుందని అక్కడి ప్రజల నమ్మకం.

Share this post with your friends