దక్షిణామూర్తి రూపం ఎప్పుడైనా గమనించారా? ఆ రూపం మనకేం చెబుతోందంటే..

దక్షిణామూర్తి స్వరూపాన్ని ఎప్పుడైనా పరిశీలించి చూశారా? స్వామివారు ఓ మర్రి చెట్టు కింద కూర్చొని ఉంటారు. ఆయన ఒక కాలు మడిచి పెట్టుకుని.. మరో కాలితో కింద రాక్షసుణ్ణి తొక్కుతున్నట్టుగా కనిపిస్తారు. ఇక దక్షిణామూర్తి చుట్టూ ఋషులు కూర్చుని ఉంటారు. ఎందుకలా? ఆ భంగమి ఆంతర్యం ఏంటనే విషయాలు ఈ భంగిమలో ఆంతర్యమేమిటో తెలుసుకుందాం. బ్రహ్మకు నలుగురు కుమారులు. వారి పేర్లు.. సనక, సనందన, సనాతన, సనత్కుమారులు. ఈ నలుగురూ బ్రహ్మ జ్ఞానం కోసం ఎన్నో రకాలుగా తపస్సు ఆచరించారు. అయినా వారికి బ్రహ్మజ్ఞానం అంతుపట్టలేదు. ఇక లాభం లేదనుకుని ఒకరోజు పరమోత్కృష్టమైన జ్ఞానం కోసం పరమ శివుని దగ్గరకు వెళ్లారు.

ఈ నలుగురూ శివుడి వద్దకు వెళ్లినప్పుడు ఆయన ఒక మర్రి చెట్టు కింద కూర్చున్నాడు. ఆయన చుట్టూ నలుగురు ఋషులు కూర్చున్నారు. బ్రహ్మ కుమారులతో పరమేశ్వరుడు ఒక మాట కూడా మాట్లాడకుండా యోగ భంగిమలో కూర్చున్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఋషులందరికీ అనుమానాలన్నీ వాటంతటవే పటాపంచలైపోయి జ్ఞానోదయమైంది. ఈ రూపాన్నే దక్షిణామూర్తి స్వరూపంగా పేర్కొనడం జరుగుతోంది. ఇంతకీ దక్షిణామూర్తి రూపం మనకు ఏం సూచిస్తోందంటారా? జ్ఞానాన్ని మాటల్లో చెప్పలేం.. దానిని అనుభవించి తెలుసుకోవాల్సిందేనని సూచిస్తోంది. దు:ఖాలకుక మూలకారణం అజ్ఞానం. అది పటాపంచలైతే దు:ఖాలు తొలగిపోతాయి.

Share this post with your friends