తిరుమలలో పదే పదే వసతి గదులు పొందుతున్న వారిపై ఈవో ఫోకస్..

తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు మరింత సౌకర్యవంతంగా, పారదర్శకంగా వసతి కల్పించాలని టీటీడీ ఈవో జె. శ్యామలరావు అధికారులను ఆదేశించారు. టీటీడీ ఈవో మంగళవారం సాయంత్రం గోకులం విశ్రాంతి భవనంలోని సమావేశ మందిరంలో జేఈవోలు శ్రీమతి గౌతమి, శ్రీ వీరబ్రహ్మం, రిసెప్షన్‌, ఐటీ విభాగం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ ద్వారా తిరుమలలో ఎన్ని గదులు అందుబాటులో ఉన్నాయి, ఎంత మంది యాత్రికులకు వసతి కల్పించవచ్చు అనే అంశాలపై ఈవోకు వివరించారు.

సీడీ రీఫండ్, దళారులను గుర్తించడంతో పాటు వారిని నియంత్రించే మార్గాలు, తిరుపతిలో అందుబాటులో ఉన్న వసతి, కొత్తగా నిర్మాణంలో ఉన్న పిఏసిలు, ఇతర సంబంధిత అంశాలపై ఈవో సమీక్షించారు.అనంతరం పదే పదే వసతి పొందుతున్న వారి వివరాలు, గదులు సక్రమంగా ఖాళీ చేయకపోవడం, ఇతర సమస్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆయన ఆదేశించారు.ఈ సమావేశంలో వసతి విభాగం డిప్యూటీ ఈవోలు శ్రీ హరీంద్రనాథ్, శ్రీ భాస్కర్, ట్రాన్స్‌పోర్ట్ (జిఎం) శ్రీ శేషారెడ్డి, ఐటీ జిఎం శ్రీ సందీప్ రెడ్డి, ఓఎస్డి శ్రీ సత్రే నాయక్, ఏఈఓ (కంప్యూటర్స్) శ్రీ వెంకటేశ్వర్లు నాయుడు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Share this post with your friends