ఈ ఆలయంలో ముగ్గురు దేవతల్లో ఒక్కొక్కరిదీ ఒక్కో ప్రత్యేకత..

తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం పరిధిలో వెలసిన బూరుగు గడ్డ వేణుగోపాల స్వామి ఆలయం ప్రత్యేకతలేంటో తెలుసుకున్నాం. అలాగే ఇక్కడ ఆది వరాహ లక్ష్మీ నరసింహ వేణుగోపాలస్వామి గర్భగుడిలో కొలువై ఉంటారు. ఇక్కడ మూర్తులను ఎంత చూసినా తనివి తీరదు. క్షేత్రంలోని మూర్తులన్నీ అత్యంత ఆసక్తికరంగా ఉంటాయి. నలుపు, తేనె రంగు కలిసి రాతిలో ఇక్కడి దేవతా మూర్తులుంటాయి. ప్రతి మూర్తిలోను జీవం తొణికిసలాడుతూ.. కనుముక్కు తీరు చూస్తే ముచ్చట కలుగుతుంది. ఎంతో అందమైన దేవతా మూర్తులు కళకళలాడుతూ భక్తులకు కనుల పండుగ చేస్తుంటాయి.

ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో వెలుగొందుతున్న ఈ ఆలయంలోని వేణుగోపాలస్వామిని దర్శించుకుంటే చాలు.. పిల్లలు లేని వారికి సంతానం కలుగుతుందని చెబుతారు. ఇక్కడ ముగ్గురు దేవతామూర్తుల్లో ఒక్కొక్కరిని దర్శించుకుంటే ఒక్కో ప్రయోజనం కలుగుతుందట. శ్రీ భూ ఆదివరాహ స్వామి దర్శనం వల్ల భూ వివాదాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఇక అక్కడ కొలువైన లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం వల్ల గ్రహపీడలు దూరమవుతాయని భక్తుల విశ్వాసం. ఇక గోదాదేవి దర్శనంతో అవివాహితులకు కల్యాణ యోగం కలుగుతుందట. ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో వెలుగొందుతోన్న ఈ ఆలయాన్ని మీరు కూడా ఓ మారు దర్శించుకోండి.

Share this post with your friends