ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు భారీ విరాళం అందజేసిన శ్రీవారి భక్తుడు

తెనాలికి చెందిన శ్రీ సత్య శ్రీనివాస్ (నేషనల్ స్టిల్స్, సిఎఫ్ఓ) ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.1.5 కోట్లు విరాళం అందించారు. తిరుమల గోకులం విశ్రాంతి భవనంలోని సమావేశ మందిరంలో శుక్రవారం చెక్కును దాత టిటిడి ఈఓ శ్రీ జె.శ్యామల రావుకు అందజేశారు. ఇక వీకెండ్ వచ్చేసింది. తిరుమలలో రద్దీ సర్వసాధారణంగానే పెరుగుతుంది. ఇవాళ శ్రీవారి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నాయి. మొత్తంగా 26 కంపార్టుమెంట్లలో శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు.

టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటల సమయం పడుతోంది. ఇక నిన్న శ్రీ మలయప్ప స్వామివారిని 65,980 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారికి 27,441 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీనివాసుడి హుండీ ఆదాయం నిన్న రూ.4.21 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. ఇక తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా టీటీడీ చర్యలు తీసుకుంటోంది. సరసమైన ధరలకు ఆహారం అందేలా చూస్తోంది. అన్న ప్రసాద భవనంలోనూ శుభ్రమైన, రుచికరమైన భోజనం అందించే దిశగా టీటీడీ ఈవో చర్యలు తీసుకుంటున్నారు.

Share this post with your friends