శరత్ పూర్ణిమ ఇవాళే దీనిని రాస పూర్ణిమగా ఎందుకు పిలుస్తారో తెలుసా?

శరత్ పూర్ణిమ లేదంటే కాముడి పున్నమి గురించి హిందువులందరికీ తెలిసిందే. శరదృతువులో ఆశ్వీయుజ మాసం శుక్ల పక్ష పౌర్ణమిని మనం శరత్ పూర్ణిమగా జరుపుకుంటాం. ఈ రోజుతో శరదృతువు ప్రారంభమవుతుంది. శరత్ పూర్ణిమను కొజాగరాత్రి పూర్ణిమ, కాముడి పున్నమి అని కూడా అంటారు. అది ఇవాళే. బుధవారం రాత్రి 8:41 గంటలకు ప్రారంభమై అక్టోబర్ 17న సాయంత్రం 4:53 గంటలకు ముగుస్తుంది.కాబట్టి మనం ఇవాళ శరత్ పూర్ణిమను జరుపుకుంటున్నాం. శరత్ పూర్ణిమ రోజున శ్రీ మహా విష్ణువుతో పాటు లక్ష్మి దేవి, చంద్రుడిని పూజిస్తారు.

అయితే శరత్ పూర్ణిమను రాస పూర్ణిమ అని ఎందుకు అంటారో తెలుసుకుందాం. గోపికలతో శ్రీకృష్ణుడు గోపికలతో రాసలీలలాడాని మనకు తెలిసిందే కదా. ఆ సమయంలో చంద్రుడి వెన్నెలలో గోపికలతో కలిసి కన్నయ్య నాట్యమాడేవాడట. అందుకే ఈ పున్నమిని రాస పున్నమి అని కూడా అని పిలుస్తారు. అందుకే శరద్ పూర్ణిమ నృత్యం, వేడుకలకు ప్రసిద్ధి చెందింది. ఉత్తరాదిలో అయితే ఇవాళ చక్కగా నృత్యం చేస్తారు. అంతేకాకుండా ఇవాళ లక్ష్మీదేవి భూమిని సందర్శించడానికి వస్తుందని కూడా నమ్మకం. కాబట్టి లక్ష్మీదేవిని పూజించుకుంటారు.

Share this post with your friends