గోకర్ణలోని గణపతిని ద్విభుజ గణపతి అని ఎందుకు పిలుస్తారో తెలుసా?

కర్ణాటకలోని పుణ్యక్షేత్రాలలో గోకర్ణలో వెలసిన ద్విభుజ మహా గణపతి. ఇక్కడి గణపతి రామాయణంతో ముడిపడి ఉంటాడు. ఇఒకరోజు రావణుడి తల్లి కైకసి గోకర్ణ సముద్రతీరంలో ఇసుక శివలింగాన్ని తయారు చేసి తపస్సు చేసింది. ఆమె తపస్సు చేస్తుండగా రాకాసి అలలు వచ్చి శివలింగాన్ని ముంచేశాయి. దీంతో కైకసి తీవ్రంగా కలత చెందిందట. రావణుడు ఆమె వద్దకు వచ్చి విషయం తెలుసుకుని తాను ఆత్మలింగాన్ని తీసుకు వస్తానని అక్కడి నుంచి వెళ్లిపోయాడట. అనంతరం రావణుడు భీకర తపస్సు చేశాడట. తన పేగుల్ని వీణగా మార్చి మరీ శివుడిని ప్రార్థించగా ఆయన ప్రత్యేక్షమై ఆత్మలింగాన్ని వరంగా ఇచ్చాడట. ఈ ఆత్మలింగాన్ని ఏడాది పాటు నిరంతరం పూజిస్తే, మీరే శివుడు అవుతారని.. కానీ ఈ ఆత్మ భూమిని ఎట్టి పరిస్థితుల్లోనూ తాకకూడదని.. తాకితే నీ తపస్సు అంతా వృధా అవడమే కాకుండా ఆత్మలింగం నీ నుంచి వెళ్ళిపోతుందని చెప్పారట.

ఆత్మలింగాన్ని స్వీకరించిన రావణుడు గోకర్ణ మీదుగా లంకకు తీసుకెళుతుండగా.. విష్ణు మూర్తి సుదర్శన చక్రంతో సూర్యుడిని కవర్ చేశాడట. అయితే సంధ్యావందనం మూడు పూటలూ తప్పక చేసే రావణుడు ఆత్మలింగాన్ని నేలపై పెట్టలేక గోవుల వేషంలో వినాయకుడిని కలుసుకుని కాసేపు శివలింగాన్ని పట్టుకోమని.. భూమిపై మాత్రం పెట్టవద్దని చెప్పాడట. అయితే రావణుడు ఎంతకూ రాకపోవడంతో మూడు సార్లు పిలిచి చివరకు ఆత్మలింగాన్ని భూమిపై పడేశాడట. రావణుడు వచ్చి ఆత్మలింగాన్ని పైకెత్తడానికి ఎంత యత్నించినా అది కదలదు. విషయం దేవతల ద్వారా తెలుసుకున్న శివుడు అక్కడకు వచ్చి గోకర్ణంలో గణపతి లింగాన్ని ప్రతిష్టంచి పూజించమని ఆదేవఇంచాడు. అప్పుడు రావణుడు తన తల్లిని తీసుకొచ్చి గణపతిని, ఆత్మలింగాన్ని భక్తితో పూజిస్తాడు. అందుకే గోకర్ణలో గణపతిని ద్విభుజ గణపతి అంటారు.

Share this post with your friends