
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని భక్తులు తమ స్తోమతకు తగినట్టుగా కొలుస్తూ ఉంటారు. శ్రీనివాసుడికి సంబంధించి ఏ ఆలయంలోనైనా పూజలు మాత్రం అత్యంత వైభవంగానూ.. సంప్రదాయబద్దంగానూ జరుగుతుంటాయి. ఆగమ శాస్త్రాల ప్రకారం పూజాధికాలు, అర్చనలు, అభిషేకాలు జరుగుతుంటాయి. అయితే శ్రీ వేంకటేశ్వర స్వామివారికి మాత్రం ఆసక్తికరంగా సీజనల్ ఫ్రూట్స్‌ను సమర్పిస్తూ ఉంటారు. తూర్పు గోదావరి జిల్లా అన్నవరప్పాడు గ్రామంలో శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువుదీరాడు.
కోరిన కోరికలు తీర్చే భక్తుల పాలిట కొంగు బంగారంగా వేంకన్న ఇక్కడ పూజలు అందుకుంటున్నాడు. ఈ ఆలయానికి ఉభయ గోదావరి జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి దర్శించుకుంటారు. శ్రీ వేంకటేశ్వరస్వామి అలంకారప్రియుడు కాబట్టి ఇక్కడ స్వామివారికి బాగా ఇష్టమైన శనివారం నాడు స్వామివారిని అత్యంత సుందరంగా అలంకరిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ ఆలయంలో సీజనల్ ఫ్రూట్స్‌తో పాటు పువ్వులు, ధాన్యాలతో ప్రత్యేకంగా అలంకరిస్తూ ఉంటారు. అలాగే శనివారం నాడు ఈ ఆలయానికి వచ్చే భక్తులకు అన్నదానాన్ని సైతం నిర్వహిస్తూ ఉంటారు.
