ఆలయాల్లో ధనుర్మాసం సందర్భంగా పెద్ద ఎత్తున వేడుకగా తిరుప్పావై నిర్వహిస్తున్నారు. ఈ మాసంలో ముఖ్యంగా గోదాదేవిని ప్రత్యేకంగా ఆరాధిస్తారు. అయితే గోదాదేవి ఆలయాలు దక్షిణాదిలో మాత్రమే కనిపిస్తాయి. దక్షిణాదిలో ముఖ్యంగా ఒక గోదాదేవి ఆలయం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. సాధారణంగా వేణుగోపాల స్వామివారి ఆలయంలో ఆయనతో కలిసి గర్భాలయంలోనో లేదుంటే ఉపాలయంలోనో దర్శనమిస్తూ ఉంటారు. ఒకవేళ అమ్మవారు ప్రత్యేక ఆలయంలో ఉన్నా కూడా ముందుగా స్వామివారిని దర్శించుకున్న తర్వాతే అమ్మవారిని దర్శకుంటారు. కానీ ఈ ఆలయంలో మాత్రం విభిన్నంగా ఉంటుంది.
ముందుగా అమ్మవారిని దర్శించుకున్న తర్వాతే వేణుగోపాల స్వామిని దర్శించుకుంటారు. ఆ ఆలయం ఎక్కడుందంటే.. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం పరిధిలో వెలసిన బూరుగు గడ్డలో ఉంది. ఇక్కడ వేణుగోపాల స్వామి ఆలయం చాలా ప్రత్యేకమైనది. గర్భాలయంలో ఆది వరాహ లక్ష్మీ నరసింహ వేణుగోపాలస్వామి భక్తులకు దర్శనమిస్తారు. ఒకే వేదికపై మూడు మూర్తులు ఉంటారన్నమాట. అయినా సరే.. ప్రధాన దైవంగా వేణుగోపాలస్వామి పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు. గర్భాలయంలో వేణు గోపాలుడు.. ఆలయ ప్రాంగణంలోనే మరో ప్రత్యేక మందిరంలో గోదాదేవి అమ్మవారు కనిపిస్తుంది.