రోజుకు ఐదు సార్లు రంగులు మార్చే శివయ్య ఎక్కడున్నాడో తెలుసా?

హిందూ ఆలయం ప్రతిదీ ఏదో ఒక ప్రత్యేకతను కలిగి ఉంటుంది. ఇక శివాలయాల విషానికి వస్తే ప్రతి ఊరిలోనూ ఉంటాయి. ద్వాదశ జ్యోతిర్లింగ ఆలయాలతో పాటు ఎన్నో శైవక్షేత్రాలు అద్భుతానికి ఆనవాళ్లుగా ఉంటాయి. ఇలాంటి అద్భుత ఆలయాల్లో ఒకటే కల్యాణ సుందరేశ్వర ఆలయం. ఇది తమిళనాడులోని కుంభకోణంలో ఉంది. వాస్తవానికి కుంభకోణంలో చాలా అద్భుతమైన, ఆసక్తిని రేకెత్తించే ఆలయాలు ఉన్నాయి. ఈ కల్యాణ సుందరేశ్వర ఆలయం కూడా ఆ కోవకు చెందిందే. ఇక్కడి శివయ్య రంగులు మారుస్తూ ఉంటాడు. ఇక్కడ శివుడు కొలువై ఉంటాడు. ఆయన భార్య పార్వతీదేవి గిరి సుందరిగా పూజలు అందుకుంటూ ఉంటుంది. ఈ ఆలయంలోని శిల్పకళ మనల్ని మంత్ర ముగ్దుల్ని చేస్తూ ఉంటుంది. ఈ ఆలయం విశిష్టత ఏంటో తెలిస్తే షాక్ అవుతారు.

అదేంటంటే శివుడు రోజులో ఐదు సార్లు తన రంగును మార్చేసుకుంటాడు. అంటే ఇక్కడి శివలింగాన్ని ప్రతిరోజూ ఉదయాన్నే చందనం పూతతో పూర్తిగా కప్పేస్తారు. ఉదయం 9 గంటలకు శివలింగం అంతా పూర్తిగా బంగారంలా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ శివలింగం ఉదయం అంటే 8 నుంచి 11 గంటల మధ్య నలుపు రంగులో కనిపిస్తుంది. ఆ తరువాత మధ్యాహ్నం 12 నుంచి ఒంటి గంట వరకూ తెలుపు రంగులో శివలింగం దర్శనమిస్తుంది. సాయంత్రం పూజ సమయంలో అంటే మధ్యాహ్నం 3 గంటల నుంచి 7 గంటల వరకూ ఎరుపు రంగులోనూ.. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకూ లేత నీలం రంగులోనూ.. ఇక చివరిగా అంటే రాత్రి 11 గంటల నుంచి 12 గంటల వరకూ ప్రకాశవంతమైన ఆకుపచ్చరంగులోనూ కనిపిస్తుంది.

Share this post with your friends