శ్రీవారిని ఏ వారం దర్శించుకుంటే ఎలాంటి ప్రతిఫలం దక్కుతుందో తెలుసా?

తిరుమల ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వారాలు, వర్జాలతో పని లేదు. ఎప్పుడు వీలైతే అప్పుడు వెళ్లి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటాం. శ్రీ మలయప్ప స్వామివారి దర్శనానికి ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. అయితే ఏడుకొండల వాడిని వారంలో ఏ వారం దర్శించుకున్నా ఏదో ఒక ప్రతిఫలం అయితే ఉంటుంది. మరి ఏ వారం ఎలాంటి ప్రతిఫలం ఉంటుందో చూద్దాం.

ఆదివారం: వీకెండ్స్‌లో తిరుమలలో రద్దీ విపరీతంగా ఉంటుందని తొందరగా ఎవరూ దర్శనానికి వెళ్లరు కానీ ఆ రోజున స్వామివారిని దర్శించుకుంటే ప్రయోజనం అపారం. ఈరోజున స్వామివారిని దర్శించుకున్న వారికి ఉద్యోగ, రాజకీయ రంగాల్లో పురోగతితో పాటు ఆస్తులు కూడా కలిసొస్తాయట. అలాగే విష్ణులోకం ప్రాప్తిస్తుందట.

సోమవారం: శ్రీవారిని సోమవారం పుష్కరిణిలో స్నానమాచరించిన అనంతరం దర్శించుకోవాలట. ఇలా చేస్తే మానసిక ప్రశాంతతతో.. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయట.

మంగళవారం: శ్రీ మలయప్ప స్వామివారిని మంగళవారం దర్శించుకుంటే రుణ బాధల నుంచి విముక్తి.. సొంతింటి కల నెరవేరుతుందట.

బుధవారం: స్వామి వారిని ఈ రోజున దర్శిస్తే సరస్వతీ కటాక్షం కలుగుతుందని.. పిల్లలు చదువుల్లో రాణిస్తారట.

గురువారం: ఈ రోజున పెళ్లి కాక ఇబ్బంది పడేవారు దర్శించుకుంటే తప్పక సమస్యలన్నీ తొలగి వివాహం సెట్ అవుతుందట. సంతానం లేని వారికి సంతాన భాగ్యం కూడా కలుగుతుందట.

శుక్రవారం : ఈ రోజున శ్రీవారిని దర్శించుకుంటే లక్ష్మీ కటాక్షం కలిగి తద్వారా అదృష్టం, ఐశ్వర్యం సిద్ధిస్తుందటజ

శనివారం: ఈ రోజున శ్రీ వేంకటేశ్వరుని దర్శించుకుంటే నవగ్రహ దోషాలన్నీ తొలగి.. కలి బాధల నుంచి విముక్తి లభిస్తుందట

Share this post with your friends